నటి ఐంద్రీలా శర్మ హఠాన్మరణానికి కారణం అదేనా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఏ సమయంలో ఏ వ్యాధి మనిషిని కబలిస్తుందో తెలియని పరిస్థితి.. ఒక వ్యాధి తగ్గింది అనుకుంటే.. మనకు తెలియకుండానే మరో వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు అనేకం దీనికి నిదర్శనం. తాజాగా క్యాన్సర్ నుంచి బయటపడిన బెంగాలీ నటి..
ఏ సమయంలో ఏ వ్యాధి మనిషిని కబలిస్తుందో తెలియని పరిస్థితి.. ఒక వ్యాధి తగ్గింది అనుకుంటే.. మనకు తెలియకుండానే మరో వ్యాధి బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు అనేకం దీనికి నిదర్శనం. తాజాగా క్యాన్సర్ నుంచి బయటపడిన బెంగాలీ నటి ఐంద్రీలా శర్మ రెండు రోజుల క్రితం స్ట్రోక్‌తో చనిపోయారు. ఐంద్రిలా శర్మ క్యాన్సర్ చికిత్స చేయించుకోవడం వల్ల ఆమెకు స్ట్రోక్ వచ్చి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అసలు క్యాన్సర్ కార్డియాక్ అరెస్ట్‌కు ఎలా దారి తీస్తుంది. కార్డియాక్ అరెస్ట్, గుండెపోటుకు మధ్య తేడా తెలుసుకుందాం. కార్డియాక్ అరెస్ట్ అంటే ఆకస్మాత్తుగా వ్యక్తి గుండె పనిచేయడం ఆగిపోతుంది. ఇక ఎటువంటి చికిత్సకు గుండె స్పందిచదు. మెదడు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయడం ఆ సమయంలో ఆగిపోతుంది. కార్డియాక్ అరెస్ట్ రావడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. దానికి తగిన చికిత్స చేసినా ఆ సమయంలో ఫలితం ఉండకపోవచ్చు. కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తికి ఒంటినిండా చెమటలు పడతాయి. లూజ్ మోషన్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ. పల్స్ ఒక్కసారిగా పడిపోతుంది. శ్వాస తీసుకోలేరు. స్పృహ కోల్పోతారు.
బ్రెయిన్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్ మధ్య సంబంధం
ధమనులు మూసుకుపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ రావొచ్చు. ధమనులు నిరోధానికి గురైనప్పుడు గుండెపోటు ఏర్పడి తరువాత బ్రెయిన్ స్ట్రోక్‌కు దారితీస్తుంది. అథెరోస్ల్కెరోసిస్ అనే వ్యాధి ప్రక్రియలో భాగంగా కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ఒకదానితో ఇంకొకటి సంబంధం కలిగి ఉంటాయంటున్నారు నిపుణులు. అథెరోస్ల్కెరోసిస్ ఉన్నప్పుడు ఒత్తిడి, రక్తపోటు, మత్తుపదార్థాల వినియోగం, ధూమపానం, మధుమేహం లేదా ఏదైనా కఠిన వ్యాయామం కారణంగా సైలెంట్ బ్లాక్ పగిలి గడ్డకట్టడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ లేదా గుండెపోటుకు దారితీస్తుందంటున్నారు. తీవ్రమైన గుండెపోటు గుండె ఆగిపోవడానికి దారి తీస్తుంది. గుండె పూర్తిగా ఆగిపోయి శరీరంలోని వివిధ అవయవాలకు తగినంత ఆక్సిజన్, రక్తం అందించలేకపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు.
కార్డియాక్ అరెస్ట్‌కు క్యాన్సర్ ఎలా కారణమవుతుంది..?
క్యాన్సర్, క్యాన్సర్ చికిత్స కార్డియాక్ అరెస్ట్‌కు కారణం కావొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. క్యాన్సర్ వల్ల కూడా గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని, క్యాన్సర్ నాళాలు గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుందంటున్నారు. ప్రధానంగా కాళ్ళలోని చిన్న నాళాలలో ఈ పరిణామం సంభవిస్తుందని, క్యాన్సర్ వ్యాధి ఉన్న రోగికి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇది గుండె, ఊపిరితిత్తులు, మెదడుకు హాని కలిగించవచ్చని వైద్యులు అంటున్నారు. కీమోథెరపీ లేదా రేడియోథెరపీతో పాటు క్యాన్సర్ వ్యాధి గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..