Food Habits: ఉదయం లేచిన తర్వాత ఇలా చేస్తే.. డి-విటమిన్ పుష్కలంగా అందుతుంది..
శరీరానికి శక్తి ఎంతో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలని చెబుతుంటారు. ఒక్కో ఆహార పదార్థంలో ఒక్కోరకమైన మిటమిన్ ఉంటుంది. దీంతో మన ఆహారంలో అనేక పదార్థాలు ఉండేలా జాగ్రత్త పడతాం. కాని విటమిన్- డి మాత్రం ఎటువంటి..
శరీరానికి శక్తి ఎంతో అవసరం. వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలని చెబుతుంటారు. ఒక్కో ఆహార పదార్థంలో ఒక్కోరకమైన మిటమిన్ ఉంటుంది. దీంతో మన ఆహారంలో అనేక పదార్థాలు ఉండేలా జాగ్రత్త పడతాం. కాని విటమిన్- డి మాత్రం ఎటువంటి ఆహారం తినకుండానే లభిస్తుంది. సాధారణంగా శీతాకాలం వచ్చిందంటే అందరు వెచ్చదనాన్ని కోరుకుంటారు. ఉదయం పూట బయటికి రావడానికి అస్సలు ఇష్టపడరు. కాని ఉదయం లేవగానే కొద్దిసేపు ఎండ ఉన్న చోట నిలబడినా, వాకింగ్ చేసినా మనకు విటమిన్-డి లభిస్తుంది. విటమిన్-డి సరైన మోతాదులో లేకపోయినా ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో సూర్యుడు కాస్త ఆలస్యంగా తన కిరణాలను ప్రసరింపజేస్తాడు. ఆ నులివెచ్చని కిరణాలను ప్రతి ఒక్కరు ఆస్వాదించాలి. అప్పుడు నిత్యం ఆరోగ్యంగా ఉంటారుని సూచిస్తున్నారు నిపుణులు.
సూర్యోదయం తర్వాత 25 నుంచి 30 నిమిషాల పాటు ఎండలో వాకింగ్ చేస్తే చాలా మంచిది. పిల్లలు, వృద్ధులు తప్పకుండా ఈ పనిచేయాలి. అప్పుడు విటమిన్ డి మీ శరీరానికి అందుతుంది. ఈ విటమిన్ మీ రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది. సూర్యకాంతిలో ఉన్న UVA రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను, శ్వాసక్రియ రేటును తగ్గిస్తుంది. సూర్యకాంతిలో ఉండే సెరోటోనిన్, మెలటోనిన్, డోపమైన్ మీ మానసిక ఆరోగ్యానికి, ఆందోళన, డిప్రెషన్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
విటమిన్ డి ఆహారం ద్వారా తీసుకోవడం సాధ్యం కాదు. కేవలం ఇది సూర్యరశ్మి ద్వారానే సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి పది గ్లాసులు పాలు తీసుకుంటే కనీస మొత్తంలో విటమిన్ డి శరీరంలో చేరుతుంది. సూర్యకిరణాలు బలహీనంగా ఉంటే విటమిన్ డి తయారు చేసే సామర్థ్యాన్ని శరీరం 95 శాతం కోల్పోతుంది. అయితే శరీరం ఎంత మేర అవసరమో అంతే మొత్తంలో సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి ని గ్రహిస్తుంది. శరీరంలో అత్యంత శక్తివంతమైన రసాయనాలల్లో విటమిన్ డి కూడా ఒకటి. ఇది లేకుండా వ్యాధులను ఎదుర్కోవడం చాలా కష్టం.
మరిన్నిహెల్త్ వార్తల కోసం చూడండి..