Andhra Pradesh: యానాంలో రాజకీయ రచ్చ.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మధ్య పేలిన మాటల తూటాలు.. వింటే చెవులకు చిల్లులే..!

యానాంలో రాజకీయాలు మరోసారి ఆసక్తిగా మారాయి. సందర్భం ఏదైనా.. వేదిక ఎక్కడైనా పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఇప్పుడు కార్తీక వన భోజనాల్లోనూ

Andhra Pradesh: యానాంలో రాజకీయ రచ్చ.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మధ్య పేలిన మాటల తూటాలు.. వింటే చెవులకు చిల్లులే..!
Yanam
Follow us

|

Updated on: Nov 22, 2022 | 6:00 AM

యానాంలో రాజకీయాలు మరోసారి ఆసక్తిగా మారాయి. సందర్భం ఏదైనా.. వేదిక ఎక్కడైనా పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఇప్పుడు కార్తీక వన భోజనాల్లోనూ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల తూటాలు పేలాయి. యానాంలో ఎమ్మేల్యే అశోక్, మాజీ మంత్రి మల్లాడి కృష్ణా రావు మధ్య పొలిటికల్ వైరం రోజు రోజుకూ ముదురుతోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు నెక్ట్స్ లెవల్‌కి వెళ్లాయి. ఆదివారం రోజు జరిగిన కాపు వనభోజనాల సందర్భంగా మల్లాడిని ఉద్దేశించి దుర్మార్గుడు అంటూ ఎమ్మెల్యే అశోక్ చేసిన వ్యాఖ్యలకు.. 24 గంటల్లోనే మల్లాడి కౌంటర్ ఇచ్చారు.

ప్రపంచ మత్స్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై సెటైర్లతో కూడిన నాటకాలను ప్రదర్శించారు. దుష్టులు ఎవరో, దుర్మార్గులు ఎవరో రాబోయే మూడేళ్లలో ఎమ్మేల్యేకు యానాం ప్రజలే చూపిస్తారంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పేకాట క్లబ్‌లను ఎమ్మేల్యే అశోక్ ప్రోత్సహిస్తున్నారని, అభివృద్ధి కోసం నిధులను సాధించలేక పోయారని, కులాల వారిగా సమాజాన్ని విడగొడుతున్నారనే అర్ధం వచ్చేలా నాటక ప్రదర్శన జరిగింది. మల్లాడి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం యానాంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కార్తీక వన మహోత్సవాల సందర్భంగా ఆదివారం.. వేలాదిమంది తన సామాజిక వర్గ ప్రజలతో వన భోజనాల కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్ నిర్వహించారు. ఆ తర్వాత రోజే మల్లాడి ఆధ్వర్యంలో యానాంలో ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకలు జరిగాయి. అన్ని మతాలు, కులాల వారిని వన భోజనాలకు ఆహ్వానించారు. ఇలా పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా.. ఒకరిపై ఒకరు విరుచుకుపడటంతో యానాంలో రాజకీయాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles