Kim Jong Un: తొలిసారి తన కూతురుని ప్రపంచానికి చూపించిన కిమ్.. చేతిలో చెయ్యి వేసి మరీ..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Nov 19, 2022 | 11:59 AM

ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏది చేసిన సంచలనమే. తన మొండి వైఖరి కారణంగా..

Kim Jong Un: తొలిసారి తన కూతురుని ప్రపంచానికి చూపించిన కిమ్.. చేతిలో చెయ్యి వేసి మరీ..
Kim Jong Un

ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏది చేసిన సంచలనమే. తన మొండి వైఖరి కారణంగా.. ప్రపంచం వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యారు. అగ్రరాజ్యం అమెరికాతోనే ఢీ అంటే ఢీ అంటూ యావత్ ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేశాడు. ఉత్తరకొరియాకు మిత్ర దేశాలకంటే, శత్రువులే ఎక్కువ. అందుకే.. తనకు సంబంధించిన ప్రతీ అంశాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు కిమ్. అయితే, ఈ మధ్య కిమ్‌ వైఖరిలో చాలా మార్పు కనిపిస్తోంది. చిన్న అంశాన్ని సైతం ఎంతో గోప్యంగా ఉంచే కిమ్.. ఇప్పుడు ఏకంగా తన ఫ్యామిలి మెంబర్స్‌ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

ఏడు నెలల క్రితం భార్యతో కలిసి కనిపించిన కిమ్.. తాజాగా తొలిసారి తన కుమార్తెతో కలిసి బహిరంగంగా కనిపించారు. ఇలా ఆయన కుమార్తెతో కనిపించడం ప్రపంచవాప్తంగా చర్చనీయాంశమైంది. కుమార్తెతో కలిసి చేతిలో చేయి వేసి నడుస్తున్న కిమ్ ఫొటోలను అధికారిక మీడియా కేసీఎన్ఏ ప్రచురించింది. నవంబరు 18న ఓ క్షిపణి ప్రయోగాన్ని వీక్షించేందుకు వస్తూ కిమ్ తన కుమార్తెను కూడా వెంటబెట్టుకొచ్చారు. నవంబరు 18 గురువారం ప్యాంగాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌ఫీల్డ్ నుంచి బాలిస్టిక్ మిసైల్‌ను ఉత్తర కొరియా ప్రయోగించింది. నార్త్ కొరియా ఈనెలలో ప్రయోగించిన రెండో ప్రయోగం ఇది. ఈ క్షిపణి 999.2 కిలోమీటర్లు ప్రయాణించి జపాన్ సముద్ర తీరంలో పడింది. యూఎస్ ప్రధాన భూభాగాన్నంతటినీ ఏక కాలంలో ధ్వంసం చేయగల సామర్థ్యం దీనిసొంతం అని చెబుతున్నారు ఉత్తర కొరియా అధికారులు.

ఇదిలాఉంటే.. వాస్తవానికి కిమ్ వ్యక్తిగత జీవితం ఇప్పటికీ రహస్యమే. బాస్కెట్ బాల్ మాజీ స్టార్ డెనిస్ రోడ్మన్ 2013లో బ్రిటిష్ డైలీ ‘గార్డియన్’తో మాట్లాడుతూ.. కిమ్‌కు ఓ కుమార్తె ఉందని, ఆమె పేరు ‘జు ఏ’ అని పేర్కొన్నారు. తాను ఆయన కుటుంబంతో గడిపానని చెప్పుకొచ్చారు. కిమ్‌ను మంచి తండ్రిగా అభివర్ణించిన ఆయన.. కిమ్ భార్య ‘రి సోల్ జు’తోనూ మాట్లాడానన్నారు. కాగా, జులై 2012 వరకు కిమ్-రి వివాహంపై ప్రభుత్వ మీడియా వెల్లడించలేదు. అప్పటికి మూడేళ్ల ముందే వీరి వివాహాన్ని దక్షిణ కొరియా నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఆ తరువాత కొంతకాలానికి 2018లో నార్త్ కొరియా అధికారిక మీడియా కిమ్ భార్యకు ‘ప్రథమ మహిళ’గా పట్టం కట్టింది. కాగా, కిమ్ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu