Ukraine War: అగ్రరాజ్యాధినేత జో బైడెన్ నోట ‘మూడో ప్రపంచ యుద్ధం’.. ఆయన ఏమన్నారంటే..?

ఉక్రెయిన్-రష్యా దేశాల జరుగుతున్న యుద్ధానికి దాదాపు తొమ్మిది నెలల పూర్తయింది. ఇది ఇలాగే కొనసాగి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని ప్రపంచదేశాలు ఇప్పటికే..

Ukraine War: అగ్రరాజ్యాధినేత జో బైడెన్ నోట 'మూడో ప్రపంచ యుద్ధం'.. ఆయన ఏమన్నారంటే..?
Joe Biden
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 19, 2022 | 11:24 AM

ఉక్రెయిన్-రష్యా దేశాల జరుగుతున్న యుద్ధానికి దాదాపు తొమ్మిది నెలల పూర్తయింది. ఇది ఇలాగే కొనసాగి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని ప్రపంచదేశాలు ఇప్పటికే భయాందోళలన వ్యక్తం చేస్తున్నాయి. దేశాలన్నీ అణ్వాయుధాలను సమకూర్చుకున్న క్రమంలో మూడవ ప్రపంచ యుద్ధమే జరిగితే భూమి మీద జీవమనేది మిగలదనేది వారి భయానికి కారణం. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమపై రష్యా దాడిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ చేస్తున్న తొమ్మిది నెలల పోరాటంలో ‘అమెరికా మద్దతు ఇస్తుంద’నే వార్తలను ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ ఖండించారు. ‘‘ఉక్రెయిన్‌లో జరిగే మూడవ ప్రపంచ యుద్ధంలో మేము పోరడము’’ అని రాయిటర్స్ నివేదించినట్లు ఆయన ప్రస్తావించారు. జీ20 సదస్సు సమయంలో.. నవంబర్ 15న ఉక్రెయిన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న పోలాండ్‌లోని ఒక గ్రామాన్ని క్షిపణి తాకినప్పుడు అతను, అతని సీనియర్ సలహాదారుల బృందం ఆందోళనకు గురయ్యారు.

అయితే ఆ క్షిపణిని రష్యానే ప్రయోగించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ అది నిజంగా రష్యా ప్రయోగించినట్లయితే.. అమెరికా సహా నాటో ఇతర సభ్య దేశాలు పోలాండ్‌ను సైనికంగా రక్షించవలసి వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ వ్యతిరేకించే మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. కాగా, నవంబరు 15న క్షిపణి కారణంగా పోలాండ్‌లో ఇద్దరు వ్యక్తులు మరణించారని బైడెన్‌కు తెలియజేయడానికి..ఇండోనేషియాలోని బాలిలో జీ20 సదస్సులో ఉన్న బిడెన్‌ను అర్ధరాత్రి నిద్రలేపారని యుఎస్ అధికారి ఒకరు తెలిపారు. క్షిపణి నేపథ్యంలో ఉక్రెయిన్ అధికారికంగా రష్యాను నిందించింది.

అయితే రష్యన్ క్షిపణులను నిరోధించే క్రమంలో ఉక్రెయిన్ ఈ క్షిపణిని ప్రయోగించి ఉండవచ్చని.. అది అనుకోకుండా పోలాండ్‌లో ల్యాండ్ అయి ఉంటుందని అమెరికన్ నివేదికలు పేర్కొన్నాయి. ఈ మేరకు వైట్ హౌస్, ఇతర ఏజెన్సీలు కొన్ని బహిరంగ ప్రకటనలు చేశాయి. ‘‘మేము ప్రస్తుతం నివేదికలను లేదా ఏవైనా వివరాలను ధృవీకరించలేము. ఏమి జరిగిందో, తదుపరి చర్యలు ఏమిటో అనే దానిపై మేము త్వరలో నిర్ణయం తీసుకుంటామ”ని వైట్ హౌస్ ప్రతినిధి అడ్రియన్ వాట్సన్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..