AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Health: ఆ వివరాలను డిజిటలైజ్ చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రాయే.. ప్రశంసించిన నేషనల్ హెల్త్ అథారిటీ..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని, దానిని మరింత అందుబాటులోకి తీసుకురావలనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తుంది. ఇదే క్రమంలో  ప్రజల..

AP Health: ఆ వివరాలను డిజిటలైజ్ చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రాయే.. ప్రశంసించిన నేషనల్ హెల్త్ అథారిటీ..
Abha Cards
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 19, 2022 | 10:15 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యాన్ని అందించాలని, దానిని మరింత అందుబాటులోకి తీసుకురావలనే దృఢ సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తుంది. ఇదే క్రమంలో  ప్రజల ఆరోగ్యపరమైన సమాచారాన్ని ఇటీవల డిజిటలైజేషన్ చేసింది. దీనిపై నేషనల్ హెల్త్ అథారిటీ ఏపీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంది. ఇలాంటి వ్యవస్థను అమలుపరిచిన మొదటి రాష్ట్రంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మారిందని ఆయన ప్రశసించారు. శుక్రవారం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌లో జరిగిన ‘ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ ఓరియంటేషన్‌’ కార్యక్రమంలో గోపాల్‌ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి సంబంధించిన సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయడాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.కిరణ్ గోపాల్ కొనియాడారు. ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ అకౌంట్‌ కార్డులను జారీ చేయడంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని తెలిపారు.

హెల్త్ కార్డుల నమోదు కోసం ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ముందుకు వచ్చి భాగస్వామ్యం కావలసిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం ఏపీ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జీఎస్‌ నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఏబీహెచ్‌ఏ కార్డుల జారీలో ఏపీ  మన దేశంలో మొదటి స్థానంలో ఉంది. దీనిని మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరింత బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుటుంబ వైద్యుల కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఇది చాలా సంతోషకరమైన పురోగతి’’ అని అన్నారు.

తర్వాత, డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్-ఛాన్సలర్ డాక్టర్ పి.శ్యామ ప్రసాద్.. డిజిటల్ కార్డ్‌ల పంపిణీ పేదలకు  మరింత ఆరోగ్య సంరక్షణను కల్పించేందుకు దోహదపడుతుందని అన్నారు

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

34 ఏళ్లలో 57 సార్లు బదిలీ.. IAS అశోక్‌ ఖేమ్కా పదవీ విరమణ నేడే
34 ఏళ్లలో 57 సార్లు బదిలీ.. IAS అశోక్‌ ఖేమ్కా పదవీ విరమణ నేడే
ఫోక్సో కేసులో కోర్టు సినిమా స్టైల్ లో వాదోపవాదనలు.. క్లైమాక్స్‌లో
ఫోక్సో కేసులో కోర్టు సినిమా స్టైల్ లో వాదోపవాదనలు.. క్లైమాక్స్‌లో
ఈ ముగ్గురు హీరోయిన్స్ చాలా బిజీ.. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే
ఈ ముగ్గురు హీరోయిన్స్ చాలా బిజీ.. చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయంటే
మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..?
మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..?
Video: లైవ్ మ్యాచ్‌లో రింకూపై కుల్దీప్ షడన్ ఎటాక్.. కట్‌చేస్తే
Video: లైవ్ మ్యాచ్‌లో రింకూపై కుల్దీప్ షడన్ ఎటాక్.. కట్‌చేస్తే
ఆ హీరోయిన్ చేయాల్సిన సినిమాతో హిట్టుకొట్టిన తమన్నా..
ఆ హీరోయిన్ చేయాల్సిన సినిమాతో హిట్టుకొట్టిన తమన్నా..
అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో
అనాథ పిల్లల కోసం ఈ బిగ్ బాస్ బ్యూటీ ఏం చేసిందో తెలుసా? వీడియో
ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు.. శాస్త్రవేత్తల గొప్ప ప్రయోగం
ఇక పిడుగులను దారి మళ్లించవచ్చు.. శాస్త్రవేత్తల గొప్ప ప్రయోగం
ఓటీటీలోకి వచ్చేసిన ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన ఐశ్వర్య రాజేశ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ..
వేసవిలో మామిడి పండు తింటున్నారా.? అనారోగ్యం ఆమడ దూరం..
వేసవిలో మామిడి పండు తింటున్నారా.? అనారోగ్యం ఆమడ దూరం..