AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP-JSP: ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికలకు కలిసే వెళ్తాం.. ధ్రువీకరించిన బీజేపీ రాష్ట్ర నేతలు

రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసే ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము విర్రాజు అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో..

BJP-JSP: ఏపీ 2024 అసెంబ్లీ ఎన్నికలకు కలిసే వెళ్తాం.. ధ్రువీకరించిన బీజేపీ రాష్ట్ర నేతలు
BJP-JSP
శివలీల గోపి తుల్వా
|

Updated on: Nov 19, 2022 | 9:37 AM

Share

రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసే ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము విర్రాజు అన్నారు. ఇటీవల కలిసిన ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పలు అంశాలపై చర్చించారని, భవిష్యత్తులో ఆ రెండు పార్టీల కూటమికి ఎలాంటి ఇబ్బంది ఉండదని సోము వీర్రాజు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. అంధ్రప్రదేశ్‌లో జరగబోయే 2024 అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ-జెఎస్పీ కూటమి కలిసే పోటీచేయనుందని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్‌ను కలిసిన ప్రధాని ఈ విషయంతో పాటు అనేక ఇతర అంశాలపై చర్చించారని ఆయన చెప్పారు. బడుగు బలహీన వర్గాల ఇళ్ల పథకంపై జనసేన చేపట్టిన సోషల్‌ ఆడిట్‌ను అడ్డుకునేందుకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) ఎమ్మెల్యేలు, నాయకులు ప్రయత్నిస్తే బీజేపీ ఊరుకోదని వీర్రాజు అధికార పార్టీని హెచ్చరించారు.

ఇళ్ల నిర్మాణంలో సహేతుకమైన పురోగతిని సాధించడంలో ఇది ప్రభుత్వ వైఫల్యమేనని వీర్రాజు పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో 20 లక్షలు, గ్రామాల్లో 5 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని, వీటి కోసం కేంద్రం ₹ 35,000 కోట్లు ఇస్తోందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్‌కు ₹11,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, ఇందులో ఎక్కువ భాగం భూ సేకరణకే ఖర్చు అయిందని ఆయన తెలిపారు.  తమ స్వార్థం కోసమే వైసీపీ, టీడీపీ మైండ్‌ గేమ్స్ ఆడుతున్నాయని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా బీజేపీ-జెఎస్‌పీ కూటమి నిమ్మకుండలేదని ఆయన అన్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్న బీజేపీ వాదనకు ఆధారాలు ఉన్నాయని నరసింహారావు తెలిపారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలతో కూడిన చార్జిషీట్‌ను బీజేపీ త్వరలో విడుదల చేస్తుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే పని చేయడం ప్రారంభించిన “మోడీ మ్యాజిక్” 2024లో బీజేపీ-జెఎస్‌పీ కూటమిని అధికారంలోకి తీసుకువస్తుందని.. వాస్తవానికి ఇది “రాజకీయ బ్లాక్‌బస్టర్” అని నరసింహారావు సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఈ లింక్ మీద క్లిక్ చేయండి..