ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో సిట్ దూకుడు.. బీజేపీ కీలక నేతకు నోటీసులు..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్) బి.ఎల్.సంతోష్ కు సిట్ అధికారులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఈనెల 21 వ తేదీన హైదరాబాద్ కమాండ్‌

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణలో సిట్ దూకుడు.. బీజేపీ కీలక నేతకు నోటీసులు..
B.l.santosh
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 18, 2022 | 10:24 PM

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సిట్ వేగవంతం చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్) బి.ఎల్.సంతోష్ కు సిట్ అధికారులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఈనెల 21 వ తేదీన హైదరాబాద్ కమాండ్‌ కంట్రోల్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. విచారణకు హాజరుకాకపోతే అరెస్టు చేస్తామని నోటీసులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు పదే పదే బి.ఎల్.సంతోష్ పేరు ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. ఇప్పటికే తుషార్ తో పాటు బండి సంజయ్ సన్నిహితుడుగా చెబుతున్న మరో వ్యక్తికి సిట్ ఇప్పటికే నోటీసులు జారీచేసింది. ఇప్పటివరకు ఈ కేసు విషయాన్ని బీజేపీ సీరియస్ గా తీసుకోలేదు. టీఆర్ ఎస్ కూడా బీజేపీకి సంబంధం లేనప్పుడు హైకోర్టును ఎందుకు ఆశ్రయించారంటూ విమర్శించారు. అయితే ఏకంగా బీజేపీలో కీలక హోదాలో ఉన్న బి.ఎల్.సంతోష్ కు నోటీసులు జారీచేయడం పై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.

ప్రభుత్వ కనుసన్నల్లోనే సిట్ విచారణ సాగుతోందన్న ఆరోపణలు బీజేపీ చేస్తోంది.  టీఆర్ ఎస్ రాజకీయ లబ్ధి కోసమే ఓ డ్రామా సృష్టించదని కమలం పారట్ఈ విమర్శిస్తోంది. టీఆర్ ఎస్ మాత్రం బీజేపీ పెద్దల ఆదేశాలతోనే తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించారంటూ ఆరోపిస్తోంది. బీజేపీ, టీఆర్ ఎస్ ఆరోపణలు. ప్రత్యరోపణల మధ్య బిఎల్.సంతోష్ కు నోటీసులు జారీ చేయడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజింగ్) బి.ఎల్.సంతోష్ కు సిట్ నోటీసులపై బీజేపీ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ అంశంపై బీజేపీ నాయకులు ఎవరూ స్పందిచలేదు. నోటీసులకు స్పందించి సంతోష్ విచారణకు హాజరవుతారా.. లేదా అనేది వేచిచూడాల్సి ఉంది. మరోవైపు బీజేపీ  తెలంగాణ శాఖ అధ్యకులు బండి సంజయ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలోనే ఉన్నారు. దీంతో ఈ విషయంపై ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే