AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Murder Case: గంజాయి మత్తులోనే హత్య.. పోలీసుల విచారణలో ఒళ్లు గగ్గుర్పొడిచే వాస్తవాలు..

2020లో అఫ్తాబ్‌ కొట్టిన దెబ్బలకు శ్రద్దా 4 రోజుల పాటు ఆస్పత్రి పాలైనట్టు కూడా తెలుస్తోంది. గతంలో ఓసారి ఆమెను చంపేందుకు కూడా కుట్ర చేశాడు అఫ్తాబ్‌.

Shraddha Murder Case: గంజాయి మత్తులోనే హత్య.. పోలీసుల విచారణలో ఒళ్లు గగ్గుర్పొడిచే వాస్తవాలు..
Delhi Crime
Jyothi Gadda
|

Updated on: Nov 18, 2022 | 9:39 PM

Share

శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ పూనావాలాకు 5 రోజుల్లో నార్కో టెస్ట్‌ నిర్వహించాలని ఆదేశించింది ఢిల్లీలోని సాకేత్‌ కోర్ట్‌. ఈ మేరకు రోహిణి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు ఆదేశాలు జారీచేసింది. ఐతే థర్డ్‌ డిగ్రీ ఉపయోగించరాదని విచారణాధికారిని ఆదేశించింది కోర్ట్‌. మరోవైపు గంజాయి మత్తులోనే తాను శ్రద్ధ వాకర్‌ను హత్య చేశానని నిందితుడు ఆఫ్తాబ్‌ పోలీసుల విచారణలో అంగీకరించాడు. తాను తరచూ గంజాయి తాగుతుండటంతో శ్రద్ధ తనతో గొడవపడేదని, హత్య జరిగిన రోజు కూడా గంజాయి నింపిన సిగరెట్‌ తాగి ఇంటికి వచ్చినట్టు వెల్లడించాడు. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని..అప్పటికే మత్తులో ఉన్న తాను ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

ఇక ఈ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. హత్య కంటే ముందు అఫ్తాబ్‌..ఆమెను చాలాసార్లు టార్చర్‌ చేసినట్టు ఆధారాలు లభించాయి. గతంలో అఫ్తాబ్‌ దాడిలో శ్రద్ధా గాయపడ్డ ఫొటో ఇప్పుడు బయటికొచ్చింది. 2020లో అఫ్తాబ్‌ కొట్టిన దెబ్బలకు శ్రద్దా 4 రోజుల పాటు ఆస్పత్రి పాలైనట్టు కూడా తెలుస్తోంది. గతంలో ఓసారి ఆమెను చంపేందుకు కూడా కుట్ర చేశాడు అఫ్తాబ్‌. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చూడా చేసింది. దీంతో అఫ్తాబ్‌ను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఐతే కేసు వాపస్‌ తీసుకోకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని అఫ్తాబ్‌ బెదిరించడంతో ఫిర్యాదును వెనక్కి తీసుకుంది శ్రద్ధ.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 18న రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య అఫ్తాబ్ శ్రద్ధను గొంతు నులిమి చంపాడని, రాత్రంతా మృతదేహం దగ్గరే ఉండి గంజాయి నింపిన సిగరెట్లను తాగుతున్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీంతో, శ్రద్ధా శరీరంలోని కొన్ని భాగాలను డెహ్రాడూన్‌లో విసిరేసినట్లు చెప్పాడు. అందుకే ఢిల్లీ పోలీసులు ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌కు కూడా వెళ్లవచ్చు.

ఇవి కూడా చదవండి

ముంబైకి చెందిన చెఫ్ మరియు ఫోటోగ్రాఫర్ అయిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా (28) తన ‘లివ్-ఇన్ పార్ట్‌నర్’ శ్రద్ధా వాకర్ (27)ని మే 18 న ఢిల్లీలో గొంతు కోసి చంపేశాడు. దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలోని తన అద్దె ఇంట్లో సుమారు మూడు వారాల పాటు 300 లీటర్ల ఫ్రిజ్‌లో భద్రపరిచిన మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, ఆపై ఆ ముక్కలను చాలా రోజుల పాటు బయట పడేసిన ఉదాంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి