నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఇద్దరు కూలీలు సజీవ సమాధి.. శిథిలాల కింద మరికొందరు కార్మికులు!
శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారనే విషయంపై స్పష్టత లేదని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నలందా ప్రాంతంలోని బెనా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది . శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారన్న దానిపై స్పష్టత లేదు. ఈ ఘటన బగన్ బిఘా చౌక్‌లో చోటుచేసుకుంది. భక్తియార్‌పూర్-రాజౌలి రహదారి నిర్మాణ పనుల్లో ఫ్లైఓవర్‌లో ఎక్కువ భాగం కూలిపోయింది. ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. నాలుగు లైన్ల వెంతన నిర్మాణం జరుగుతోందని బీడీఓ లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారనే విషయంపై స్పష్టత లేదని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Nalanda, Bihar | An under-construction bridge collapses in the Bena police station area
Construction of a four-lane overbridge was ongoing. No clarity on how many are buried under debris: BDO Laxman Kumar pic.twitter.com/0jWYsAC4Gr
— ANI (@ANI) November 18, 2022
ఘటన జరిగినప్పుడు నాలుగు లేన్ల ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నాయని బీడీఓ లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారో ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి