ఉత్తరాఖండ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 600మీటర్ల లోతులో పడ్డ వాహనం..12 మంది మృతి..

ఇద్దరు మహిళలు సహా 12మంది మృతదేహాలను వెలికితీశారు సహాయక సిబ్బంది. వాహనం లోపల ఇంకా ఎవరైనా ఇరుక్కుపోయారేమోనని రెస్క్యూ టీం విస్తృతంగా గాలిస్తోంది.

ఉత్తరాఖండ్‌లో మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 600మీటర్ల లోతులో పడ్డ వాహనం..12 మంది మృతి..
Road Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 18, 2022 | 8:55 PM

ఉత్తరాఖండ్‌లోని చమోలిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చమోలి జిల్లా జోషిమత్ సమీపంలో బొలెరో మ్యాక్స్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. వాహనం 600 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న జిల్లా అడ్మినిస్ట్రేషన్‌ ఎస్‌డిఆర్‌ఎఫ్‌, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న 12 మంది మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

బొలెరో మ్యాక్స్ వెహికల్ UK (076453) వాహనంలో దాదాపు 16 మంది ఉన్నట్టుగా తెలిసింది. SDRF రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందింది. చీకట్లో రెస్క్యూ బృందం కాలువలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించింది. ఇద్దరు మహిళలు సహా 12మంది మృతదేహాలను వెలికితీశారు సహాయక సిబ్బంది. వాహనం లోపల ఇంకా ఎవరైనా ఇరుక్కుపోయారేమోనని రెస్క్యూ టీం విస్తృతంగా గాలిస్తోంది.

ఇవి కూడా చదవండి

జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రమేంద్ర దోబాల్‌తో సహా SDRF, NDRF, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది. అద్దాలు పగలడంతో చక్రాలు విడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్ధం వచ్చిందని స్థానికులు తెలిపారు. వాహనం కిమన గ్రామం వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఆ వాహనంలో చుట్టుపక్కల ఊరి జనం వెళుతున్నారు. ఈ రహదారి ఇంకా నిర్మాణంలో ఉందని తెలిసింది.

నవంబర్ 14న ఉత్తరాఖండ్‌లోని సితార్‌గంజ్‌లో పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 55 మంది పిల్లలు, 6 మంది సిబ్బందితో వెళ్తున్న స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇందులో ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కూడా ఈ విషయంపై సంతాపం వ్యక్తం చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న పాఠశాల విద్యార్థులంతా విహారయాత్రకు వెళ్లారని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో