AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలాంటి ఫ్రెండ్‌ ఒక్కడు చాలు.. హాయిగా నిద్రపోవచ్చు.. క్యూట్‌ లిటిల్‌ఫ్రెండ్స్‌ వీడియో వైరల్‌..

చిన్ననాడు ఉండే ఈ అందమైన స్నేహం పెద్దయ్యాక ఎందుకు చెడిపోతుందో అంటూ మరి కొందరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి ఫ్రెండ్‌ ఒక్కడు చాలు.. హాయిగా నిద్రపోవచ్చు.. క్యూట్‌ లిటిల్‌ఫ్రెండ్స్‌ వీడియో వైరల్‌..
Littleboys
Jyothi Gadda
|

Updated on: Nov 18, 2022 | 7:55 PM

Share

స్నేహం వర్ణనాతీతం. ఆపదలో వెంట ఉన్నవాడే నిజమైన స్నేహితుడు అనే సామెత కూడా ఉంది. ఏంటీ ఇదంతా.. అందరికీ తెలిసిన విషయాన్ని మరోమారు ఎందుకు చెబుతున్నారు.? అనే కదా మీ సందేహం..అయితే, ఇక్కడ కొందరు చిన్నారుల మధ్య అమాయకమైన స్నేహానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, కొందరు నెటిజన్లు దీన్ని స్నేహంగా అభివర్ణిస్తున్నారు. వైరల్‌ అవుతున్న వీడియోలో కొందరు చిన్నారులు క్లాస్‌రూమ్‌లో కూర్చున్న వీడియో ఇది. ముగ్గురు అబ్బాయిలు వీడియోలో కనిపిస్తారు.

ముగ్గురు బెంచ్‌పై కూర్చుని ఉన్నారు. అందులో పక్కనే కూర్చున్న ఓ బుడ్డొడు కూర్చున్న చోటే నిద్రపోతున్నాడు..కునికిపాట్లు పడుతూ..కిందపడబోయాడు.. దాంతో పక్కనే ఉన్న మరో బాలుడు..దగ్గరగా జరిగి నిద్రపోతున్న పిల్లాడిని భుజం మీద తల వంచి హాయిగా నిద్రపోయేలా ఆసరా అందించాడు. చిన్నారి స్నేహం మధుర్యానికి సంబంధించిన ఈ వీడియోను చాలా మంది నెటిజన్లు లైక్ చేసారు. ఈ చిన్నారి స్నేహితుల గొప్ప మనసుకు సెల్యూట్ చేసారు.

ఇవి కూడా చదవండి

చాలా మంది ఈ వీడియోపై క్యూట్, వెరీ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కష్ట సమయాల్లో చేయి పట్టుకుని భావోద్వేగానికి తోడ్పడే స్నేహితులే నిజమైన స్నేహితులు అని ఒకరు వ్యాఖ్యానించారు. ఈ పిల్లల నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పిల్లల నుంచి పెద్దలు నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. చిన్ననాడు ఉండే ఈ అందమైన స్నేహం పెద్దయ్యాక ఎందుకు చెడిపోతుందో అంటూ మరి కొందరు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఇది నా గ్యాంగే అంటూ తమ చిన్ననాటి స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఈ 26 సెకన్ల వీడియోను 27.4 మిలియన్ల మంది వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి

Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
తిన్న వెంటనే మళ్ళీ ఆకలి వేస్తోందా! ఈ విషయం తెలుసా?
హిల్ట్‌ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!
హిల్ట్‌ పాలసీ చర్చ.. నేడు రసవత్తరంగా సాగనున్న తెలంగాణ అసెంబ్లీ!