Hair care: జుట్టు బాగా రాలుతోందా? పైగా తెల్లబడి పోతుందా..? అయితే, ఇలా చేస్తే సమస్యకు చెక్.. తెలుసుకోండి
ఈ పొడి చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరిచే అనేక పదార్థాలు ఉన్నాయి. ఇది నేరుగా జుట్టును ప్రభావితం చేస్తుంది. ఈ పొడిని ఉపయోగించడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది.
ఈ రోజుల్లో అందరికి అనేక రకాల జుట్టు సమస్యలు ఉంటున్నాయి.. నీటి మార్పు, చెడు జీవనశైలి, పోషకాహారం తీసుకోకపోవడం, జుట్టుకు సరైన మూలికలు ఇవ్వకపోవడం వంటి అనేక కారణాల వల్ల జుట్టు సమస్య వస్తుంది . జుట్టు చిట్లిపోవడం, జుట్టు రాలడం, అకాల నెరసిపోవడం, చుండ్రు లాంటివి అన్నీ సాధారణ సమస్యలే అయినా ముఖంలోని మెరుపుకు వెంట్రుకల నుంచే వస్తుంది.. కాబట్టి.. ప్రతి ఒక్కరూ ఈ సమస్యల నుండి దూరంగా ఉండటానికి ఏదో ఒక పరిష్కారాన్ని అవలంబిస్తూనే ఉంటారు. కానీ, కొన్నిసార్లు అవి పెద్దగా ప్రభావం చూపవు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి హెయిర్‌ప్యాక్‌ను తయారు చేసుకుని వాడి చూడండి. ఫలితం అద్భుతంగా ఉంటుంది.
హెయిర్ ప్యాక్.. ఒక గిన్నెలో..1 స్పూన్ భృంగరాజ్ పౌడర్ తీసుకొని 3-4 చుక్కల కొబ్బరి నూనె కలపండి. 1 చెంచా పెరుగు కూడా కలపండి. అన్ని పదార్థాలను బాగా కలిపి జుట్టుకు బాగా పట్టించాలి. ఈ ప్యాక్‌ని 20 నిమిషాల పాటు అలాగే ఆరా నివ్వండి.ఆ తర్వాత జుట్టును శుభ్రంగా కడగాలి. జుట్టు మెరుపు వెంటనే పెరుగుతుంది. కొబ్బరి నూనె, బృంగరాజ్ పొడి ఒక గిన్నె తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె కలపాలి. అందులో 1 టీస్పూన్ బృంగరాజ్ పొడిని కలపండి. ఆ తర్వాత వడకట్టి ఇప్పుడు మీ జుట్టుకు నూనెను అప్లై చేయాలి. మీ జుట్టు అందం పెరుగుతుంది.
భృంగరాజ్ ఆయిల్ ప్రయోజనాలు: బృంగరాజ్ జుట్టును సహజంగా నల్లగా మార్చడంలో సహాయపడే అనేక అంశాలను కలిగి ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల జుట్టు తెల్లబడకుండా, పూర్తిగా సహజంగా ఉంటుంది. మీరు గ్రే హెయిర్‌తో బాధపడుతుంటే, బృంగరాజ్ పొడిని క్రమం తప్పకుండా వాడండి. దీంతో జుట్టుకు మంచి పోషణనిస్తుంది. భృంగరాజ్‌లో అనేక రకాల మూలికలు ఉన్నాయి. ఇది క్లెన్సర్‌గా పనిచేస్తుంది. క్లెన్సర్‌గా పని చేయడం ద్వారా, జుట్టు యొక్క మెరుపు పెరుగుతుంది. క్లెన్సర్‌ని ఉపయోగించినప్పుడు, అందులో భృంగరాజ్ ఉండేలా చూసుకోండి.
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: బృంగరాజ్ పౌడర్‌తో తయారు చేసిన హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల స్కాల్ప్ యొక్క రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు పొడిబారడాన్ని నివారిస్తుంది. స్ప్లిట్ హెయిర్ సమస్య నుండి ఉపశమనం పొందడమే కాదు.. సమస్య శాశ్వతంగా పరిష్కరించబడుతుంది. మీరు భృంగరాజ్ గురించి వినే ఉంటారు. బృంగరాజ్ జుట్టుకు ప్రయోజనకరమైన అనేక అంశాలను కలిగి ఉంది. భృంగరాజ్ అనేక నూనెలు, షాంపూలు, కండిషనర్లు, సీరమ్‌లలో ఉపయోగిస్తారు. మీరు ఈ పొడిని ఇంట్లో సులభంగా ఉపయోగించవచ్చు. కాబట్టి ఎలా ఉపయోగించాలో, ప్రయోజనాలను కూడా తెలుసుకోండి.
బృంగరాజ్ పౌడర్‌ని ఉపయోగించడం వల్ల జుట్టుకు మాయిశ్చరైజింగ్, కండిషన్ చేయడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును సిల్కీగా మార్చడంలో సహాయపడుతుంది. జుట్టు మెరుపు లోపిస్తే, మీరు సిల్కీగా చేయడానికి ఈ పొడిని ఉపయోగించవచ్చు. బృంగరాజ్ పౌడర్‌తో చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరిచే అనేక పదార్థాలు ఉన్నాయి. ఇది నేరుగా జుట్టును ప్రభావితం చేస్తుంది. ఈ పొడిని ఉపయోగించడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. మీరు జుట్టు సమస్యలతో బాధపడుతుంటే, మీరు బృంగరాజ్ పొడిని ఉపయోగించాలి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి