AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: శాస్త్రజ్ఞుల పరిశోధనలో షాకింగ్ విషయాలు.. పాత వైరస్‌లను తట్టిలేపుతున్న కరోనా.. ఇతర అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు

స్వీడన్‌లోని లింకోపింగ్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఆండ్రెస్‌ రోసెన్‌ నేతృత్వంలోని బృందం కరోనా వైరస్‌పై చేసిన పరిశోధనల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తమ అధ్యయనంలో భాగంగా.. కరోనా సోకిన 95 మంది సీఎఫ్‌ఎస్‌ బాధితులు, 110 మంది సాధారణ వ్యక్తుల రక్తం, లాలాజల నమూనాలను పరిశీలించింది

Corona Virus: శాస్త్రజ్ఞుల పరిశోధనలో షాకింగ్ విషయాలు.. పాత వైరస్‌లను తట్టిలేపుతున్న కరోనా.. ఇతర అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు
Covid 19 Infection
Surya Kala
|

Updated on: Nov 18, 2022 | 6:22 PM

Share

కరోనా మహమ్మారి ఓసారి సోకిన తర్వాత మనుషులను వీడడం లేదా? కరోనా పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్టు వస్తే తగ్గినట్టు కాదా? అంటే తాజా పరిశోధనలు అవుననే అంటున్నాయి. మనుషుల శరీరంలోకి కరోనా వైరస్‌ చొరబడ్డ తర్వాత అనేక రకాలుగా ఎఫెక్ట్‌ చూపిస్తుంది. ముఖ్యంగా అప్పటికే శరీరంలో చచ్చుబడిపోయిన వైరస్‌లను మళ్లీ తట్టిలేపుతున్నట్టు తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవుల్లో నిద్రాణ స్థితిలోకి వెళ్లిన కొన్ని వైరస్‌లు మళ్లీ క్రియాశీలకంగా మారేందుకు కొవిడ్‌ కారణమవుతోందని తాజా అధ్యయనంలో తేలింది. తీవ్రస్థాయి అలసటకు దారితీసే క్రానిక్‌ ఫటీగ్‌ సిండ్రోమ్‌ సీఎఫ్‌ఎస్‌ తో బాధపడుతున్నవారిలో ఈ ప్రభావం సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఎక్కువగా ఉంటున్నట్లు నిర్ధారణ అయింది.

స్వీడన్‌లోని లింకోపింగ్‌ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఆండ్రెస్‌ రోసెన్‌ నేతృత్వంలోని బృందం కరోనా వైరస్‌పై చేసిన పరిశోధనల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తమ అధ్యయనంలో భాగంగా.. కరోనా సోకిన 95 మంది సీఎఫ్‌ఎస్‌ బాధితులు, 110 మంది సాధారణ వ్యక్తుల రక్తం, లాలాజల నమూనాలను పరిశీలించింది శాస్త్రవేత్తల బృందం. దాదాపుగా వీరందరూ గతంలో ఎప్‌స్టీన్‌-బర్‌ వైరస్‌ ఈబీవీ బారినపడ్డవారే కావడం గమనార్హం. అయితే వారిలో చాలాకాలం క్రితమే నిద్రాణ స్థితిలోకి వెళ్లిన ఈబీవీ.. కొవిడ్‌ ప్రభావంతో తిరిగి యాక్టివ్‌గా మారింది. మహమ్మారి కారణంగా రోగనిరోధక శక్తి తగ్గిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణమని పరిశోధకులు గుర్తించారు. మరో రెండు రకాల వైరస్‌లూ కొవిడ్‌ వల్ల ఇదే తరహాలో తిరిగి యాక్టివ్‌గా మారుతున్నట్లు వారు వెల్లడించారు.

ముఖ్యంగా క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ ఉన్నవారిలో శరీరంలోని కణాలలో దాగి ఉన్న అనేక వైరస్‌లను తిరిగి యాక్టివ్‌ చేయగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. తీవ్రమైన, దీర్ఘకాలిక అలసట, శ్రమ తర్వాత అనారోగ్యం, నొప్పి, నిద్ర సమస్యలు వ్యాధి యొక్క లక్షణాలుగా గుర్తించారు. యుక్తవయసులో EBV సోకిన వ్యక్తులు తీవ్ర జ్వరం భారిన పడే అవకాశం ఉంది. అప్పుడు వైరస్ శరీరంలో గుప్త స్థితిలో ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న సందర్భాల్లో EBV వైరస్ విస్తరించవచ్చు. ఈ వైరస్‌ మరింత బలపడి అలసట, ఇతర అనారోగ్య సమస్యలు పెంచుతుందని పరిశోధకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

పాండమిక్ యొక్క మొదటి వేవ్ సమయంలో సగం మందికి కరోనా సోకింది. వారిలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ కేసులలో వైరస్‌ సంక్రమణ లక్షణం స్వల్పం. దీంతో వారికి కరోనా వచ్చి పోయిన విషయం కూడా తెలియదు. అలాంటి వారి లాలాజలాన్ని సైతం పరిశోధకులు పరిశీలించారు. వారిలోనూ మూడు రకాల పాత వైరస్‌లు తిరిగి యాక్టివ్‌ అయినట్టు గుర్తించారు. కరోనా సోకిన వ్యక్తల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ క్షిణించడంతో పాత వైరస్‌లు నరాల కణజాలంపై దాడి చేస్తాయని పరిశోధకులు తెలిపారు. ఇది కణాలలో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియాపై ఎఫెక్ట్‌ చూపుతుంది. వ్యక్తుల జీవక్రియను అణిచివేస్తుందని పరిశోధకులు చెప్పారు.

ధీర్ఘకాలం కరోనాతో భాదపడుతున్న వ్యక్తుల్లో పాత వైరస్‌లు యాక్టివ్‌ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. మూడింట ఒక వంతు మంది ఇలా కరోనాతో యాక్టివ్‌ కాబడి పాత వైరస్‌లతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా తగ్గినా కూడా కొద్దిపాటి వ్యాయామం చేసినా తీవ్రంగా అలసట రావడం, మెదడు మొద్దబారిపోవడం వంటి లక్షణాలు వీరిలో కనిపిస్తుంటాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోవడం, రుచి వాసన పసిగట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వారిలో పాత వైరస్‌లు యాక్టివ్‌ అయినట్లు గుర్తించవచ్చంటున్నారు నిపుణులు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..