Head lice: పేలు ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టాయో తెలుసా..? ఏటా 1.20 కోట్ల మంది బాధితులు.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం

తలలో నివసించే పేను శాస్త్రీయ నామం పెడిక్యులస్ హ్యూమనస్ కాపిటిస్. ఇది చాలా చిన్న జీవి. దీని పరిమాణం 2-3 మిమీ. పేనుకి రెక్కలు ఉండవు. ఓవల్ బ్రౌన్ రంగులో ఉంటుంది. పేను సుమారు 30 రోజులు నివసిస్తుంది.

Head lice: పేలు ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టాయో తెలుసా..? ఏటా 1.20 కోట్ల మంది బాధితులు.. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం
Head Lice Symptoms
Follow us
Surya Kala

|

Updated on: Nov 18, 2022 | 9:57 PM

‘పేను’ ఓ రక్తం పీల్చే కీటకం. ఈ పేలు బారిన పడని బాల్యం ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఈ పేలు ఎక్కువగా చిన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుని జీవిస్తుంది. మనిషి తలలోని వెంట్రుకల్లో దాక్కుని పేను రక్తం పీల్చి జీవిస్తుంటుంది. అమెరికన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల నుండి 1.20 కోట్ల మంది పేలు బాధితులని తెలుస్తుంది. పేను మానవులకు పెద్దగా హాని కలిగించనప్పటికీ.. మనిషి జుట్టులో నివసించే ఈ కీటకం మానవ రక్తాన్ని పీలుస్తూ జీవిస్తుంది. ఈ పేలు ఎగర లేదు లేదా నీటిలో జీవించదు. అయితే ఇది జుట్టులోకి ఎక్కడ నుండి వస్తుంది? ఈ పురుగు అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పుట్టిందినేది చాలామందికి సందేహం కూడా

మెడికల్ న్యూస్ టుడేలోని ఒక నివేదిక ప్రకారం.. తలలో నివసించే పేను శాస్త్రీయ నామం పెడిక్యులస్ హ్యూమనస్ కాపిటిస్. ఇది చాలా చిన్న జీవి. దీని పరిమాణం 2-3 మిమీ. పేనుకి రెక్కలు ఉండవు. ఓవల్ బ్రౌన్ రంగులో ఉంటుంది. పేను సుమారు 30 రోజులు నివసిస్తుంది. ఆడ పెను ప్రతిరోజూ దాదాపు 6 గుడ్లు పెడుతుంది. వీటిని నిట్స్ ఈపులు అని పిలుస్తారు. ఇవి తెల్లగా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ గుడ్లు రెండు వారాల్లో పెలుగా పరిపక్వం చెందుతాయి. ఈ ప్రక్రియ నిరాతరం కొనసాగుతుంది.

పేను ఎక్కడ పుట్టిందంటే హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం.. పేను జాతి సుమారు 1 లక్ష సంవత్సరాల నాటిదని భావిస్తున్నారు. పేనులు వాటి జన్యు నిర్మాణం ఆధారంగా క్లాడ్‌లుగా విభజించబడ్డాయి, వాటి ఆధారంగా వాటిని A, B, C అని పిలుస్తారు. జర్నల్ ఆఫ్ పారాసిటాలజీ ప్రకారం.. క్లాడ్ Bపేను ఉత్తర అమెరికాలో జన్మించినట్లు తెలుస్తోంది. తరువాత అవి యూరప్, ఆస్ట్రేలియాతో సహా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు చేరుకున్నాయి.

ఇవి కూడా చదవండి

ఏ విధంగా ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుందంటే

పేలు ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉంటే అప్పుడు పేను అవతల వ్యక్తీ తలపైకి చేరుకుంటుంది. పేను ఉన్న వ్యక్తి వాడిన తువ్వాలు, దువ్వెనలు, టోపీలు, హెయిర్ బ్రష్‌లు, బ్యాండ్‌లు, దిండు, మంచం మొదలైన వాటిని ఉపయోగించడం ద్వారా పేను మరొక వ్యక్తి జుట్టులోకి చేరుకుంటాయి.

అయితే పేను గురించి ఒక అపోహ ఉంది. ఇవి వ్యక్తి అపరిశుభ్రత కారణంగా పుడతాయని.. అయితే అది అపోహ అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. మంచి పరిశుభ్రత ఉన్న వ్యక్తికి కూడా పేను ఉన్న వ్యక్తి దగ్గర సన్నిహితంగా మెలిగితే అతనికి తల పేను రావచ్చు. పేనులు ఎక్కువగా పేదల తలలో కనిపిస్తాయనే అపోహ కూడా ఉంది. ఇది కూడా పూర్తిగా అసంబద్ధమైన ఊహ. పేల వ్యాప్తికి పేదరికానికి, సంపదకు సంబంధం లేదు.

పేను లక్షణాలు ఏమిటి? తలపై నిరంతర దురద

నెత్తిమీద లేదా వెంట్రుకల దగ్గర ఎరుపు రంగులో దద్దుర్లు వాపు కనిపిస్తే

తల గోకడం వల్ల చిన్న ఎర్రటి గడ్డలు లేదా పుండ్లు ఏర్పడవచ్చు

తలలో దురద వల్ల నిద్ర లేదా ఏకాగ్రతలో ఇబ్బంది

పేలను ఎలా నివారించుకోవాలంటే.. ఎవరినా పేలతో ఇబ్బంది పడుతుంటే.. నివారణ చర్యలు తప్పకుండా తీసుకోవాలి. పెద్ద పేను చనిపోతుంది. అయితే ఆడ పేను చనిపోయే ముందు గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు మళ్లీ పేనుగా మారతాయి. వీటిని వదిలించుకోవడానికి ఏకైక మార్గం సజీవంగా ఉన్నప్పుడే పేలను, వాటి గుడ్లను రెండింటినీ ఏకకాలంలో నివారించాల్సి ఉంటుంది.

తలలోని పేనులను తొలగించడానికి చక్కటి దువ్వెనను ఉపయోగిస్తారు. ప్రస్తుతం మార్కెట్లో అనేక పేలను నివారించే షాంపులు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి షాంపులు ఉపయోగించడం వలన పేలు జుట్టులో చనిపోతాయి. అనంతరం తలను దువ్వడం ద్వారా సులభంగా తొలగించబడతాయి. పేనులతో పాటు.. ఈ పేలను నాశనం చేయడం అవసరం. సమస్య ఎక్కువగా ఉంటే నిపుణులైన వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..