AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

175 కిలోల బరువున్న వ్యక్తికి అరుదైన ఆపరేషన్‌.. 75కేజీలు తగ్గాడు.. ఎలాగంటే..

సంజయ్ తన బరువు తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అటువంటి పరిస్థితిలో పెరుగుతున్న బరువు కారణంగా అనేక వ్యాధులను ఎదుర్కొన్నాడు. పెరుగుతున్న బరువుతో బాధపడుతూ,

175 కిలోల బరువున్న వ్యక్తికి అరుదైన ఆపరేషన్‌.. 75కేజీలు తగ్గాడు.. ఎలాగంటే..
Weight Loss Story
Jyothi Gadda
|

Updated on: Nov 18, 2022 | 4:13 PM

Share

అదుపు తప్పిన శరీర బరువు వివిధ అవయవాలపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. తీవ్ర అనారోగ్యానికి దారితీస్తుంది. అధిక బరువు ఆయుప్రమాణాన్ని తగ్గిస్తుంది. మితిమీరిన శరీర బరువు వల్ల మధుమేహం, గుండెవ్యాధులు, నిద్రలో శ్వాససమస్యలు, ఆస్టియో ఆర్థరైటిస్, కొన్నిరకాల కాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ బరువు తగ్గించేందుకు వైద్య విధానంలో ఓ అరుదైన ఆపరేషన్‌ అందుబాటులోకి వచ్చింది. అదే బేరియాట్రిక్ సర్జరీ. ఇది తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్న వారి శరీర బరువును తగ్గించేందుకు చేసే శస్త్రచికిత్స. అధిక శరీర బరువును వదిలించుకునేందుకు ఈ వైద్యపరమైన పరిష్కారం ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. దీనిలో జీర్ణాశయంలో కొంత భాగాన్ని తొలగించటమో, లేదా ఆహారం చేరకుండా నియంత్రించటమో లేదా ఆహారం జీర్ణాశయం దాటి నేరుగా చిన్నపేవులోకి వెళ్లేట్లు మార్చటమో చేస్తారు. అయితే, తాజాగా మీరట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇటీవల 175 కిలోల బరువున్న వ్యక్తికి బేరియాట్రిక్ సర్జరీ జరిగింది. శస్త్రచికిత్స తర్వాత ఈ వ్యక్తి బరువు 60 నుండి 75 కిలోల వరకు తగ్గుతుందని వైద్యులు పేర్కొన్నారు.. మొత్తం 50 నిమిషాల పాటు జరిగిన ఈ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు వైద్యులు.

అత్యంత బరువైన వ్యక్తికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయడం ఉత్తరప్రదేశ్‌లో ఇదే తొలి కేసు అని వైద్యులు తెలిపారు. ఇంతకు ముందు కూడా చాలా ఆపరేషన్లు చేశామని, అయితే 175 కిలోల బరువున్న వ్యక్తికి శస్త్రచికిత్స చేయడం బహుశా ఉత్తరప్రదేశ్‌లో మొదటిసారిగా జరిగిందని చెప్పారు. బాధిత వ్యక్తి పేరు సంజయ్ శర్మ. అతను మీరట్‌లోని బాగ్‌పట్‌లోని ఖేడ్కా నివాసి. తన శస్త్రచికిత్స విజయవంతమైనందుకు సంజయ్ చాలా సంతోషంగా ఉన్నాడు.

బాగ్‌పట్‌లోని ఖేడ్కాలో నివసిస్తున్న సంజయ్ శర్మ (45) ఊబకాయం సమస్యతో చాలా ఇబ్బంది పడ్డాడు. అతని బరువు రోజురోజుకు పెరుగుతోంది. బరువు పెరగడం వల్ల సంజయ్ చాలా ఇబ్బందులు పడ్డాడు. సంజయ్ శర్మ బరువు పెరుగుట సమస్య జన్యుపరమైనది. ఎందుకంటే అతని కుటుంబం మొత్తంలో అందరూ అధిక బరువు కలిగిన వారే ఉన్నారు. అయితే, కుటుంబ సభ్యులందరితో పోలిస్తే సంజయ్ బరువు ఎక్కువగా ఉంటాడు. సంజయ్ తన బరువు తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అటువంటి పరిస్థితిలో పెరుగుతున్న బరువు కారణంగా అనేక వ్యాధులను ఎదుర్కొన్నాడు. పెరుగుతున్న బరువుతో బాధపడుతూ, సంజయ్ శర్మ కూడా ఢిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. కానీ, అతను దాని నుండి ఎటువంటి ప్రయోజనం పొందలేకపోయాడు. ఆ తర్వాత అతను మీరట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

సంజయ్ శర్మకు శస్త్రచికిత్స చేసిన డాక్టర్ రిషి సింఘాల్ మాట్లాడుతూ.. ఈ సర్జరీతో పొట్ట తగ్గుతుందని చెప్పారు. ఎంత తగ్గించాలో ముందుగానే నిర్ణయించుకుంటామని చెప్పారు. మిగిలిన పొట్ట పరిమాణం సమస్య కాదన్నారు. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఈ సర్జరీ శాశ్వత చికిత్సగా చెప్పారు. డైట్, ఎక్సర్ సైజ్ ద్వారా బరువు తగ్గవచ్చు.. కానీ, మళ్లీ మళ్లీ పెరిగే అవకాశాలు ఎక్కువని చెప్పారు. కానీ, ఒకసారి ఆపరేషన్ ద్వారా బరువు తగ్గితే మళ్లీ వచ్చే అవకాశాలు చాలా తక్కువని చెప్పారు. ఈ సర్జరీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని డాక్టర్ రిషి తెలిపారు. శస్త్రచికిత్స తర్వాత, మీరు సాధారణ జీవనశైలిని గడుపుతారని చెప్పారు. ఇంగ్లండ్‌లో చాలా మంది పేషెంట్లు ఇలా చేయించుకున్నట్టుగా తెలిపారు.

ఆపరేషన్ చేయించుకున్న సంజయ్ శర్మ కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. సంజయ్ శర్మకు ఇంతకుముందు కూడా ఇలాంటి ఆపరేషన్ జరిగిందట. దాని కారణంగా అతను దాదాపు 70 కిలోల బరువు తగ్గాడు. కానీ, ఆ తరువాత అతని అజాగ్రత్త వల్ల మళ్లీ బరువు పెరగిపోయాడు. మళ్లీ ఊబకాయం సమస్య తలెత్తింది. ఈసారి తన బరువు తగ్గుతుందని, తాను కూడా పూర్తిగా జాగ్రత్తలు పాటిస్తానని చెప్పాడు. ఎలాంటి నిర్లక్ష్యం చేయనని చెప్పాడు. సంజయ్ శర్మ భార్య ఊర్మిళ కూడా తన భర్త నిర్లక్ష్యం వల్లే..మళ్లీ మళ్లీ సమస్య మొదలవుతుందన్నారు. అయితే ఈసారి పూర్తిగా మానుకుంటే బరువు తగ్గుతారని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి