Indian Desi Cow Milk: దేశీ ఆవు పాలు పచ్చగా ఎందుకుంటాయో తెలుసా.. అసలు సంగతి తెలిస్తే షాకవుతారు..

పాల రంగు సాధారణంగా తెల్లగా ఉంటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా. అయితే ఆవు పాల రంగు ఎందుకు పసుపు రంగులో ఉంటుందనే ప్రశ్న మనలో చాలా మందికి వచ్చి ఉంటుంది. దీని చాలా..

Indian Desi Cow Milk: దేశీ ఆవు పాలు పచ్చగా ఎందుకుంటాయో తెలుసా.. అసలు సంగతి తెలిస్తే షాకవుతారు..
Indian Desi Cow Milk
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 18, 2022 | 3:30 PM

మనలో చాలా మంది పాలు తాగడానికి ఇష్టపడతారు. ఉదయం లేదా సాయంత్రం పాలు ఖచ్చితంగా పాలు తాగే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. రాత్రిపూట ఒక గ్లాసు పాలు తాగి నిద్రపోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తాగకపోతే చాలా నష్టాలు ఉన్నాయి. అందుకే వైద్యులు ఎప్పుడూ పాలను తాగమని సూచిస్తారు. పాలను పిల్లలకు పూర్తి ఆహారంగా చెబుతారు. తల్లి పాల తర్వాత అధిక ప్రాధాన్యత ఆవు పాలుకు ఇస్తారు. ఆవు పాలు, జున్ను, పెరుగు, వెన్న లాంటి ఉత్పత్తుల్లో అధిక మొత్తంలో పోషకాలు, కాల్షియం, ప్రోటీన్‌లు లభిస్తాయని యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) చెబుతోంది. అంతేకాదు, ఆవు పాలలో ఏ, డీలతో సహా, అనేక రకాల విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయని అమెరికాలోని మయో క్లినిక్‌కు చెందిన పోషకాహార నిపుణుడు డోనల్డ్ హెన్స్‌రూడ్ వివరించారు. ఆవు పాలు చక్కని పోషక విలువలు కలిగిన ఆహారం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అని హెన్స్‌రూడ్ వివరించారు.

బ్రిటీష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ ప్రకారం, సాధారణంగా పెద్దవారు, యువకులు తీసుకునే ఆహారంలో వారికి అవసరమైనంత మోతాదులో ఐరన్, కాల్షియం, విటమిన్లు, జింక్, అయోడిన్ అందవు. వారు ఆవు పాలు తాగితే ఆ పోషకాలన్నీ లభిస్తాయి. అయితే పాల రంగు సాధారణంగా తెల్లగా ఉంటుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా. అయితే ఆవు పాల రంగు ఎందుకు పసుపు రంగులో ఉంటుందనే ప్రశ్న మనలో చాలా మందికి వచ్చి ఉంటుంది. దీని చాలా విలువైన కారణం ఉంది. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఆవు పాలు పసుపు రంగులో..

ఈ కారణంగా, ఆవు పాలు పసుపు రంగులో ఉంటాయి, అది పిల్లలైనా లేదా పెద్దలైనా, ఆవు పాలు ఉత్తమ ఆహారంగా పరిగణించబడతాయి. మీరు ఎప్పుడైనా ఆవు పాలను తాగినట్లైతే.. ఆవు పాల రంగు సాధారణంగా కొంత పసుపు రంగులో ఉండటాన్ని మీరు గమనించి ఉంటారు. పసుపు రంగులోకి మారడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. నిజానికి ఆవు పాలలో కాల్షియంతో పాటు ప్రొటీన్ కూడా ఉంటుంది. ఈ ప్రొటీన్ పేరు కెరోటిన్. దీని కారణంగా, ఆవు పాలు లేత పసుపు రంగులో ఉంటాయి.

గేదె పాలు తెల్లగా మారడానికి ప్రొటీన్ కూడా కారణమవుతుంది. గేదె పాలు ఆవు పాల కంటే మందంగా, క్రీమీగా ఉంటాయి. పెరుగు, నెయ్యి, పనీర్, కోవా వీటి పాలతో ఎక్కువగా తయారు చేస్తారు. గేదె పాలు తెల్లగా ఉంటాయి. కేసైన్ అనే ప్రొటీన్ దాని తెల్లబడటానికి కారణం.

స్వర్ణనాడి..

ఆవు మూపురంలో స్వ‌ర్ణ‌నాడి ఉంటుంది. అందుకే ఆవు పాల‌ల్లో బంగార‌త్వ‌తం ఇమిడి ఉంటుంది. ఆవు దూడ పుట్టిన మూడు రోజుల‌కే గంతులు వేస్తుంది. అదే గేదె దూడ అయితే పుట్టిన 30 రోజుల త‌రువాత గంతులు వేస్తుంది. ఈ కార‌ణం చేత ఆవు పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం చురుకుగా ఉంటామ‌ని గేదె పాల‌ను తాగ‌డం వ‌ల్ల మ‌నం బ‌ద్ద‌కంగా ఉంటామ‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే 500 ప‌శువుల మ‌ధ్య విడిచిపెట్టినా స‌రే ఆవు దూడ అవ‌లీల‌గా త‌న త‌ల్లిని చేరుకుంటుంది. అదే గేదె దూడ ప‌ది గేదెల మ‌ధ్య విడిచిపెట్టినా కూడా త‌న త‌ల్లిని గుర్తించ‌లేదు. దీనిని బ‌ట్టి ఆవు పాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల తెలివితేట‌లు పెరుగుతాయ‌ని మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. ఆవు పాలు వ్యాధులకు మేలు

చేస్తాయి ఆవు పాలను రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగిస్తారు. పాలలో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ ప్రోబయోటిక్స్ సహాయంతో శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది. అనేక ఇతర రకాల ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. మరోవైపు, జుట్టు రాలే సమస్య ఉన్నవారికి ఆవు పాలు చాలా మేలు చేస్తాయి. జుట్టు రాలడానికి కారణం శరీరంలో విటమిన్-డి, జింక్ వంటి పోషకాలు లేకపోవడమే.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ