AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Benefits: తక్కువ ఎత్తు ఉన్నారని చింతిస్తున్నారా? ఈ యోగాసనాలతో అద్భుత ప్రయోజనాలు..

మీరు పొట్టిగా ఉన్నారని చింతిస్తున్నారా? మీ ఎత్తు పెరగడం గురించి ఆందోళన చెందుతున్నారా? ఆ ఆలోచనలన్నింటికీ ఇక వీడ్కోలు చెప్పండి. ఎటువంటి మెడిసిన్స్

Yoga Benefits: తక్కువ ఎత్తు ఉన్నారని చింతిస్తున్నారా? ఈ యోగాసనాలతో అద్భుత ప్రయోజనాలు..
Yoga
Shiva Prajapati
|

Updated on: Nov 18, 2022 | 2:57 PM

Share

మీరు పొట్టిగా ఉన్నారని చింతిస్తున్నారా? మీ ఎత్తు పెరగడం గురించి ఆందోళన చెందుతున్నారా? ఆ ఆలోచనలన్నింటికీ ఇక వీడ్కోలు చెప్పండి. ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా సహజంగానే మీ శరీర ఎత్తును కొంతమేర పెంచుకోవచ్చు. ఇందుకు యోగా దోహదపడుతుందని నిపుణులు తెలిపారు. యోగా చేయడం వల్ల సహజంగానే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అందుకే యావత్ ప్రపంచం యోగా వైపు దృష్టి కేంద్రీకరించింది. ప్రతిరోజూ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల శరీరంలోని గ్రోత్ హార్మోన్‌కు బూస్ట్ లభిస్తుంది. తద్వారా శరీర ఎత్తు పెరుగుతుంది. యోగాలో కొన్ని భంగిమలు శరీర ఎత్తును పెంచడంలో సహాయపడుతాయి. ఆ ఆసనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. తడాసన..

ముందుగా నిటారుగా నిలబడాలి. భుజాలు, మెడను సమలేఖనం చేయాలి. తర్వాత నెమ్మదిగా రెండు చేతులను పైకెత్తి లోతైన శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా కాలి మడమలను పైకి లేపి కాలి మీద నిలబడండి. మీ శరీరాన్ని వీలైనంత వరకు సాగదీయండి. మీ కాళ్ళు, చేతులను నిటారుగా ఉంచండి. ఈ భంగిమను చేయడం ద్వారా శరీర ఎత్తు పెరగడానికి సహాయపడుతుంది.

2. ఉష్ట్రాసనం..

ఈ ఉష్ట్రాసనం శరీరాన్ని ఉత్కృష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీ కాళ్ళను వెనుకకు విస్తరించి నేలపై మోకరిల్లి ప్రారంభించండి. ఉదరం ఆకాశం వైపు చూస్తున్నట్లుగా ఉండనివ్వండి. తర్వాత రెండు చేతులను మీ తుంటిపై ఉంచి లోతైన శ్వాస తీసుకోండి. ఆ తరువాత అరచేతులను మీ కాళ్ళపై ఉంచి, నెమ్మదిగా వంగాలి. మీ తలను వెనుకకు వంచండి. 10 సెకన్ల పాటు ఈ భంగిమలో ఉండాలి.

ఇవి కూడా చదవండి

3. పశ్చిమోత్తనాసనం..

ముందుగా రెండు కాళ్లను వీలైనంత ముందుకు చాచి కూర్చోవాలి. నెమ్మదిగా ఊపిరి తీసుకుని ముందుకు వంగాలి. అలా వంగి కాలి వేళ్లను చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించాలి. వీపును నిటారుగా ఉంచాలి. వీలైనంత వరకు నుదుటిని మోకాళ్లకు తాకడానికి ప్రయత్నించాలి.

4. వృక్షాసనం..

పాదాలను కలిపి నిటారుగా నిలబడండి. ఆ తర్వాత చేతులను పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మీ కుడి కాలును ఎడమ మోకాలి వైపుకు మడిచి, ఆపై ఎడమ కాలుపై నిలబడండి. మీ కుడి పాదం అరికాలు మీ ఎడమ తొడ లోపలి భాగాన్ని తాకాలి. ఇప్పుడు మీ చేతులను పైకెత్తి, మీ చేతులను నమస్కార స్థితిలో ఉంచండి. ఈ భంగిమను కొన్ని సెకన్లపాటు ఉంచాలి.

5. ధనుస్సు..

ఈ ఆసనాన్ని ప్రారంభించేటప్పుడు ముందుగా నేలపై పడుకోవాలి. తర్వాత రెండు కాళ్లను వెనుక నుంచి పైకి లేపాలి. తర్వాత ముఖాన్ని పైకెత్తి వెనుక నుంచి రెండు చేతులతో పాదాన్ని గట్టిగా పట్టుకుని నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. కొన్ని సెకన్ల పాటు ఈ స్థితిలో ఉండాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..