Winter Care: చలికాలంలో స్నానం చేసేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయొద్దు.. ప్రాణాలకే ముప్పు వాటిళ్లొచ్చు..
చలికాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. తీవ్రమైన చలి కారణంగా ప్రతిరోజూ స్నానం చేయాలనిపించదు. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది గీజర్ లేదా, హీటర్ ద్వారా..
చలికాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. తీవ్రమైన చలి కారణంగా ప్రతిరోజూ స్నానం చేయాలనిపించదు. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది గీజర్ లేదా, హీటర్ ద్వారా వేడి నీటితో స్నానం చేస్తుంటారు. ఇది కాస్త ఉపశమనంగా ఉంటుంది. కానీ, కొందరు మాత్రం ఏ సీజన్ అయినా చన్నీళ్లతోనే స్నానం చేస్తుంటారు. అయితే, మరీ చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల ఒక్కోసారి ప్రమాదం బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. చలికాలంలో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. చల్లటి నీళ్లలో స్నానం చేసిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని, ఇలాంటి ఉదంతాలు చాలా చోటు చేసుకున్నాయని గుర్తు చేస్తున్నారు నిపుణులు.
పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడైనా రావొచ్చు. కానీ, శీతాకాలంలో ఈ రిస్క్ మరింత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి పరిస్థితుల్లో సీరియస్‌గా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఏదో సందర్భంలో ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నట్లేనని స్పష్టం చేశారు. అందుకే చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేసే ముందు ఒకసారి ఆలోచించాలని సూచిస్తున్నారు.
వేడి నీళ్లతో లాభాలేంటి?
వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో.. అంతే నష్టాలు కూడా ఉంటాయి. శరీరంలో చెడు కొవ్వు పేరుకుపోవడం వలన ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే, రోజూ వేడి నీళ్లతో తలస్నానం చేస్తే గుండె సమస్యలు, స్ట్రోక్ సమస్య తగ్గుతుంది. రోజూ వేడి నీళ్లతో స్నానం చేసేవారిలో ఆరోగ్య సమస్యలు చాలా తక్కువగా ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది. ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మంచి నిద్ర కూడా పడుతుంది.
రోజూ స్నానం చేయాలా? వద్దా?
అమెరికాలో మూడింట రెండు వంతుల మంది రోజూ స్నానం చేస్తారు. ఆస్ట్రేలియాలో 80 శాతం కంటే ఎక్కువ మంది స్నాన చేస్తారు. కానీ, చైనాలో మాత్రం 50 శాతం మంది వారానికి రెండు సార్లు మాత్రమే స్నానం చేస్తారట. భారతదేశంలో మాత్రం ప్రతిరోజూ స్నానం చేయడం ఆచారం. సాంప్రదాయ భారతీయుల ఇళ్లలో స్నానం చేయకుండా పూజలు చేయరు. వంటగదిలోకి కూడా ప్రవేశించరు.
చన్నీటితో స్నానం ఎఫెక్ట్..
చళ్లని నీటితో స్నానం చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను అస్సలు విస్మరించొద్దంటున్నారు. మరి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలేంటి? శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. లక్షణాలు కనిపించిన వెంటనే అలర్ట్ అయి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.
బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు..
1. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలను అస్సలు విస్మరించొద్దు. ప్రాణాంతకమైన ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ అవడానికి ముందే శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. 2. శరీరంలోని ఏ భాగంలోనైనా తిమ్మిర్లు వస్తుంటాయి. 3. అస్పష్టమైన దృష్టి. 4. శరీరంలో బలహీనత. 5. తీవ్రమైన తలనొప్పి. 6. వాంతులు, వికారం. 7. మాట్లాడేటప్పుడు తడబాటు. 8. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. 9. మెదడులో రక్తస్రావం కారణంగా మూర్ఛపోవడం జరుగుతంది.
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.