- Telugu News Photo Gallery Anxiety Relief Tips: tips for anxiety relief these tips will help you to get rid of stress quickly
Anxiety Relief Tips: నిత్యం ఏదో ఒక ఆందోళనతో భయపడుతున్నారా..? ఈ చిట్కాలతో ఈజీగా రిలాక్స్ అవ్వొచ్చు..
ఆధునిక కాలంలో చాలా మంది ప్రజలు చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో నిద్రలేమి సమస్యకూడా వెంటాడుతుంటుంది. దీని ద్వారా ఒత్తిడి, ఆందోళన, గాభరపాటు, భయం వెంటాడుతుంది. వీటిన్నింటికి చెక్ పెట్టేందుకు పలు చిట్కాలను అనుసరించవచ్చు. దీని ద్వారా ఆందోళన, మానసిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
Updated on: Nov 18, 2022 | 1:43 PM

నడక కోసం వెళ్లండి : ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ప్రజలు ఒత్తిడి, ఆందోళనతో జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఇది చేసే పనితోపాటు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇది చిరాకుగా మొదలై.. మానసిక సమస్యగా మారుతుంది. అందుకే.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీరు కొన్ని చిట్కాలను అనుసరించడం మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత కాలంలో శారీరక శ్రమ చాలా ముఖ్యం. పని నుంచి విరామం తీసుకొని కాసేపు నడకకు వెళ్లండి. ఈ శారీరక శ్రమ.. ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడుతుంది.

నోట్స్ రాయండి: నిత్యం డైరీ రాయడం అలవాటు చేసుకోండి. మీకు అవకాశం దొరికినప్పుడల్లా మీ భావాలను డైరీలో రాయండి. ఇది మీకు చాలా తేలికగా అనిపిస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఆహారాలు: మీ ఒత్తిడిని తగ్గించేటటువంటి ఆహారాలను తీసుకోండి. రెగ్యులర్‌గా అరటిపండ్లు తినడం మంచిది. ఇది ఒత్తిడిని తొలగించడంలో సహాయపడుతుంది. మీరు ద్రాక్ష, నారింజ వంటి పుల్లటి పండ్లను కూడా తినవచ్చు.

కుటుంబంతో గడపండి : ఈ రోజుల్లో బిజీ షెడ్యూల్ కారణంగా ప్రజలు తమ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో కుటుంబంతో కొంత సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది.