AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhrapradesh: కాకినాడలో వింత గొర్రె పిల్ల జననం .. చూసేందుకు బారులు తీరిన జనం..

ఈ వింత ఘటన చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వింత గొర్రె పిల్లను చూడడానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇది కలికాలం ఇలాంటి వింతలే జరుగుతాయి. అయినా ఇదంతా ఎప్పుడో బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Andhrapradesh: కాకినాడలో వింత గొర్రె పిల్ల జననం .. చూసేందుకు బారులు తీరిన జనం..
Two Heads Lamb
Surya Kala
|

Updated on: Nov 18, 2022 | 4:13 PM

Share

ఈ సృష్టిలో చిత్ర విచిత్రాలు ఎన్నో.. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కూడా ఎప్పుడో ఇలాంటి విషయాలు చెప్పారు. నీళ్లతో దీపాలు వెలిగిస్తారంటూ విద్యుత్ శక్తి గురించి వివరించారు. యంత్ర వాహనాలతో ఎద్దులు లేకుండానే బళ్లు నడుస్తాయన్నారు. వేపచెట్టు నుంచి పాలు స్రవిస్తాయన్నారు. అది నిజమయింది. తాజాగా కాకినాడలో అదే జరిగింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో రెండు తలల గొర్రె జన్మించింది. ఈ వింత గొర్రె పిల్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం తరలి వస్తున్నారు. రైతు పంపనబోయిన వెంకన్న పెంచుకుంటున్న గొర్రెకు రెండు తలల గొర్రె పిల్ల జన్మించింది. ప్రస్తుతం గొర్రె పిల్ల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని రైతు వెంకన్న తెలిపారు. అయితే, వివిధ జన్యులోపాల వల్ల ఇలాంటి గొర్రె పిల్లలు జన్మించే అవకాశం వుందని పశు వైద్య నిపుణలు చెబుతున్నారు. కాగా సోషల్‌మీడియాలో ఈ గొర్రె పిల్లకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి.

అంతేకాదు ఈ వింత ఘటన చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. ఈ వింత గొర్రె పిల్లను చూడడానికి చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఇది కలికాలం ఇలాంటి వింతలే జరుగుతాయి. అయినా ఇదంతా ఎప్పుడో బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అవి ఇప్పుడు నిజమవుతున్నాయి అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
ఏ పాత్రలో తాగితే ఏ వ్యాధి నయమవుతుందో తెలుసా?
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
తీర్థయాత్రలకు వెళ్లి.. సత్రంలో ఉరి వేసుకుని ఫ్యామిలీ మాస్ సూసైడ్!
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
వార్డెన్ లివర్ ముక్కలు వేయలేదని.. విద్యార్థులు ఏం చేశారంటే?
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
నమ్మకం భారతదేశానికి అతిపెద్ద ఆస్తిః ప్రధాని మోదీ
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
మొహం నిండా గాయాలతో క్రికెటర్ బెన్ స్టోక్స్. షాక్ లో అభిమానులు
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
నీ కోసం.. కొండనైనా కదిలిస్తా.. నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
సినిమా కోసం సముద్రంలోనే జిమ్.. హీరో రిస్క్ చూస్తే మెంటలెక్కిపోద్ద
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
వెంటనే బోర్డర్ దాటండి.. ఇరాన్‌‌లోని అమెరికన్లకు పిలుపు
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
ఈడెన్ గార్డెన్స్‌లో హెట్‌మైర్ సిక్సర్ల జాతర..గేల్ రికార్డ్ బ్రేక్
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ
భాగ్యనగరం వేదికగా రికార్డులకెక్కిన మెగా ఐస్‌క్రీమ్ పార్టీ