Ram Charan: బాబాయ్ కు బాసటగా అబ్బాయ్.. జనసేన కు జై కొట్టిన చెర్రీ ఫ్యాన్స్..

Surya Kala

Surya Kala |

Updated on: Nov 13, 2022 | 7:23 PM

ఇప్పటికే మెగా అభిమానులు తాము నెక్స్ట్ ఎన్నికల్లో జనసేనకు సపోర్ట్ చేస్తామని  ఓ ప్రకటన చేశారు. ఇటీవల మెగా స్టార్ చిరంజీవి కూడా తన మద్దతు తన తమ్ముడీకే అని చెప్పకనే చెప్పారు కూడా.. ఇప్పడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంతు వచ్చింది. 

Ram Charan: బాబాయ్ కు బాసటగా అబ్బాయ్.. జనసేన కు జై కొట్టిన చెర్రీ ఫ్యాన్స్..
Pawan Kalyan Ram Charan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీ స్థాపించి.. ప్రజల సమస్యల కోసం తన గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే అనేక సమస్యలతో పాటు థియేటర్ టికెట్ల ధరపై తన  నిరసన వ్యక్తం చేశారు. అయితే పవన్ కు మద్దతుగా మెగాఫ్యామిలీ నుంచి నిలిచింది మెగా బ్రదర్ నాగబాబు..బహిరంగంగా తన తమ్ముడికి తాను అండగా ఉంటాను చెప్పారు. నర్సాపురం ఎంపీగా జనసేన తరపున పోటీ చేశారు కూడా..  అయితే ఇప్పటి వరకూ జనసేనకు మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ బహిరంగంగా పెద్దగా సపోర్ట్ చేసింది లేదు. అయితే కాలక్రమంలో పవన్ పోరాటానికి మెగా ఫ్యామిలీ అండగా నిలబడడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగా అభిమానులు తాము నెక్స్ట్ ఎన్నికల్లో జనసేనకు సపోర్ట్ చేస్తామని  ఓ ప్రకటన చేశారు. ఇటీవల మెగా స్టార్ చిరంజీవి కూడా తన మద్దతు తన తమ్ముడీకే అని చెప్పకనే చెప్పారు కూడా.. ఇప్పడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంతు వచ్చింది.

ఈరోజు హైదరాబాదులో రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ నుంచి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు చెర్రీ అభిమానులు. నెక్స్ట్ ఎన్నికల్లో తమ మద్దతు జనసేనకు తెలపాలని రామ్ చరణ్ అభిమానుల నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ తీర్మానం కూడా చేశారు. అంతేకాదు.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాకు ప్రమోషన్ భారీ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు. జనసేనను మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి అంశాలపై చర్చించి, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని రామ్ చరణ్ అభిమానులు భావిస్తున్నారు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu