Araku Valley: ఆంధ్రా ఊటీలో అందాల హరివిల్లు .. వరస సెలవులతో పర్యాటకులతో కళకళలాడుతున్న అరకు

పర్యాటక రద్దీతో అరకులోయలోని హోటల్ గదిలోని హౌస్ ఫుల్ అయ్యాయి. చాలామంది పర్యటకులకు అద్దె రూమ్స్ దొరక్క పోవడంతో రోడ్ల పక్కన చలిమంటలు వేసుకుంటూ తమ సొంత వాహనాలలోనే కాలక్షేపం చేశారు.

Araku Valley: ఆంధ్రా ఊటీలో అందాల హరివిల్లు .. వరస సెలవులతో పర్యాటకులతో కళకళలాడుతున్న అరకు
Araku Valley
Follow us
Surya Kala

|

Updated on: Nov 13, 2022 | 4:09 PM

ప్రముఖ పర్యాటక కేంద్రం ఆంధ్రా ఊటీ అరకులోయ పర్యాటకులతో కళకళాడుతోంది. రెండో శనివారం, ఆదివారం, చిల్డ్రన్స్ డే మూడు రోజులు వరుస సెలవు దినాలు రావడంతో ఒక్కసారిగా అరకులోయను సందర్శించే పర్యటకాల సంఖ్య విపరీతంగా పెరిగింది. బొర్రాగుహలు, గాలికొండ వ్యూ పాయింట్, పద్మాపురం గార్డెన్స్, చాపరాయి తదితర ప్రదేశాలన్నీ పర్యాటకుల వాహనాలతో బారులు తీరాయి. ఒక్కసారిగా విపరీతంగా పర్యాటకులు రావడంతో కొన్ని పర్యాటక ప్రదేశాల్లో సమస్య కూడా తలెత్తింది. ఘాట్రోడ్లో పలు ప్రదేశాలలో వాహనాలు క్యూ కట్టాయి.  మరోవైపు పర్యాటక రద్దీతో అరకులోయలోని హోటల్ గదిలోని హౌస్ ఫుల్ అయ్యాయి. చాలామంది పర్యటకులకు అద్దె రూమ్స్ దొరక్క పోవడంతో రోడ్ల పక్కన చలిమంటలు వేసుకుంటూ తమ సొంత వాహనాలలోనే కాలక్షేపం చేశారు. శనివారం ఒక్కరోజే సుమారు 20వేల మంది పర్యాటకులు పైనే అరకులోయని సందర్శించారు. ఆదివారం పూట ఆ సంఖ్య మరింత పెరిగింది . దీంతో ఒక్కసారిగా అరకులోయలో ఎటు చూసినా గుంపులు గుంపులుగా పర్యాటకులు సందడి చేస్తూనే ఉన్నారు.

రూమ్స్ దొరకపోవడంతో చాలామంది పర్యాటకులు.. మేఘాల ప్రాంతమైన మాడగడ వద్దకు చేరుకొని రాత్రంతా అక్కడే గడుపుతూ ఉషోదయం కోసం ఎదురు చూశారు. ఈ ఏడాది పర్యాటక సీజన్ ప్రారంభమైనప్పటికీ స్తబ్దుగా ఉన్న పర్యాటకం ఒక్కసారిగా ఊపందుకోవడంతో అరకులోయ వాసులు, వ్యాపారులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..