AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ టీమిండియా ప్లేయర్‌తో రూం షేరింగ్ అంటే పిచ్చెక్కిపోద్ది.. 5 నిమిషాల్లోనే ఖాళీ చేశా..!

Ajay Jadeja, Venkatesh Prasad: క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య స్నేహంతోపాటు సరదా సంఘటనలు ఎన్నో ఉంటాయి. అయితే, తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ అజయ్ జడేజా చెప్పిన ఓ ఆసక్తికర విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరో టీమిండియా ప్లేయర్‌తో గది పంచుకున్న జడేజా, కేవలం 5 నిమిషాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయారట.

ఆ టీమిండియా ప్లేయర్‌తో రూం షేరింగ్ అంటే పిచ్చెక్కిపోద్ది.. 5 నిమిషాల్లోనే ఖాళీ చేశా..!
Ajay Jadeja, Venkatesh Prasad
Venkata Chari
|

Updated on: Aug 17, 2026 | 5:18 PM

Share

Ajay Jadeja, Venkatesh Prasad: క్రికెట్‌లో ఆటగాళ్ల మధ్య స్నేహం, సరదా సంఘటనలు ఎన్నో ఉంటాయి. కానీ అజయ్ జడేజా చెప్పిన ఓ పాత జ్ఞాపకం మాత్రం ఇప్పుడు అందరి ఆసక్తిని పెంచుతోంది. టొరంటో పర్యటనలో వేంకటేశ్ ప్రసాద్‌తో గది పంచుకున్న జడేజా, కేవలం 5 నిమిషాల్లోనే అక్కడి నుంచి వెళ్లిపోయారట. అందుకు సంబంధించిన వివరాలు ఓసారి చూద్దాం. భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తాజా టెస్టు సిరీస్‌లో మాజీ ఆటగాడు అజయ్ జడేజా కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ పరిస్థితులను విశ్లేషించడంతో పాటు, తన కాలం నాటి ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంటూ మ్యాచ్‌ను మరింత వినోదాత్మకంగా మారుస్తున్నాడు. ఇదే క్రమంలో గాలే వేదికగా జరిగిన టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టాడు. కెరీర్ తొలినాళ్లలో భారత జట్టుతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ఎదురైన ఒక ఫన్నీ సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నాడు. ఒక తోటి బౌలర్‌తో కలిసి గదిని పంచుకోవాల్సి వచ్చినప్పుడు, ఆ వాతావరణం నచ్చక కేవలం 5 నిమిషాలలోనే ఆ రూమ్ ఖాళీ చేసి మరో గదికి మారినట్లు జడేజా వెల్లడించాడు. దీంతో కామెంట్రీ బాక్స్‌లో నవ్వులు పూయించాడు.

టొరంటో పర్యటనలో భిన్న మనస్తత్వాలు..

తొంభైల దశకంలో కెనడాలోని టొరంటో వేదికగా జరిగే క్రికెట్ సిరీస్‌లకు అభిమానుల్లో విపరీతమైన ఆదరణ ఉండేది. అలాంటి ఒక సిరీస్ ఆడేందుకే భారత జట్టు అప్పట్లో టొరంటో నగరానికి వెళ్లింది. ఆ పర్యటనలో అజయ్ జడేజాకు స్టార్ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్‌తో కలిసి ఒకే గదిని కేటాయించారు. మైదానంలో ఎంత అగ్రెసివ్‌గా బౌలింగ్ చేసినప్పటికీ, ప్రసాద్ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉండేవాడు. కఠినమైన క్రమశిక్షణను పాటించే ఆయన, తన బట్టలు, వస్తువులను ఎప్పుడూ ఒక పద్ధతిగా సర్దుకునే రకం. దానికి పూర్తిగా భిన్నమైన మనస్తత్వం జడేజాది. ఆనాటి జట్టులో చురుకైన ఫీల్డర్‌గా పేరున్న జడేజా, జీవితాన్ని చాలా సరదాగా గడిపేవాడు. హోటల్ గదిలోకి అడుగుపెట్టగానే తన లగేజీని ఇష్టమొచ్చినట్లు గదిలో చెల్లాచెదురుగా పడేశాడు. అలా తన వస్తువులను బెడ్‌పై వేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు.

ఎక్కువమంది చదివినది: వాళ్లలా రికార్డుల కోసం కాదు.. జట్టు విజయం కోసం ఆడతా.. గంభీర్ శిష్యుడి షాకింగ్ కామెంట్స్..!

ఇవి కూడా చదవండి

ప్రసాద్ పెట్టిన కండీషన్స్.. 5 నిమిషాల్లోనే జంప్..

తన పని ముగించుకుని గదిలోకి వచ్చిన వెంకటేష్ ప్రసాద్.. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. గది మొత్తం అస్తవ్యస్తంగా ఉండటం ప్రసాద్‌కు ఏమాత్రం నచ్చలేదు. వెంటనే ఆయన జడేజా వస్తువులు, బట్టలను తీసి సరైన స్థానంలో చక్కగా అమర్చాడు. తనతో పాటు ఒకే గదిలో ఉండాలంటే క్రమశిక్షణ అవసరమని, ఏమాత్రం నిర్లక్ష్యం ఉండకూడదంటూ తేల్చి చెప్పాడు. వస్తువులు ఎక్కడనుంచి తీస్తే మళ్లీ అక్కడే పెట్టాలనే కండీషన్ పెట్టాడు. ప్రసాద్ పెట్టిన ఈ నిబంధనలు విన్న జడేజాకు, ఆ సిస్టమాటిక్ వాతావరణంలో తాను ఇమడలేనని వెంటనే అర్థమైంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, తన వస్తువులన్నీ సర్దుకుని కేవలం 5 నిమిషాల్లోనే ఆ గది నుంచి బయటకు వచ్చేశాడు. నేరుగా అప్పటి భారత జట్టు స్పిన్నర్ ఆశిష్ కపూర్ గదికి వెళ్లిపోయాడు. ఆశిష్ కపూర్ కూడా జడేజా లాగే ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా సరదాగా ఉండే వ్యక్తి.

మైదానంలో మాత్రం ఇద్దరూ, ఇద్దరే..

మైదానం వెలుపల వీరిద్దరి వ్యక్తిత్వాలు ఎంత భిన్నంగా ఉన్నప్పటికీ, భారత క్రికెట్ చరిత్రలో ఇరువురి పాత్ర ఎంతో కీలకం. అజయ్ జడేజా అప్పట్లో కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్‌గా సేవలు అందించాడు. క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకోవడంలో జడేజా ఎప్పుడూ ముందుండేవాడు. తన కెరీర్‌లో 15 టెస్టు మ్యాచ్‌లు ఆడి 576 పరుగులు సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచిన ఆయన, 196 మ్యాచ్‌ల్లో ఆరు సెంచరీల సాయంతో 5359 పరుగులు చేశాడు. దేశవాళీ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఏకంగా 20 సెంచరీలు, లిస్ట్-ఎ మ్యాచుల్లో 11 సెంచరీలు నమోదు చేసి బ్యాట్‌తో తన మార్క్ చూపించాడు.

ఎక్కువమంది చదివినది: Asia Cup 2026: ఆసియా కప్‌నకు పాక్ జట్టు ప్రకటన.. భారత్‌తో మ్యాచ్ ఆ రోజే.. పూర్తి వివరాలు ఇవిగో..!

బౌలింగ్ విభాగంలో వెంకటేష్ ప్రసాద్ టీమిండియా పేస్ దళానికి వెన్నెముకగా నిలిచాడు. ప్రసాద్ తన కెరీర్‌లో 33 టెస్టుల్లో 96 వికెట్లు పడగొట్టాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యంత ప్రమాదకర బౌలర్‌గా ఎదిగిన ఆయన, 161 వన్డే మ్యాచ్‌ల్లో 196 వికెట్లు సాధించాడు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 361 వికెట్లు, లిస్ట్-ఎ ఫార్మాట్‌లో 295 వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. విభిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కలిసి ఒకే జట్టు కోసం ఎలా విజయాలు సాధించారో చెప్పేందుకు ఈ ఇద్దరి ప్రయాణమే ఒక చక్కటి ఉదాహరణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us