AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amitabh Bachchan: 83 ఏళ్ల వయసులో స్టీరింగ్ పట్టిన బిగ్ బి.. అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు స్టైల్ చూస్తే..

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సినిమాలు, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ గురించి నిత్యం నెట్టింట చర్చ జరుగుతూనే ఉంటుంది. 83 ఏళ్ల వయసులో ఏమాత్రం విశ్రాంతి లేకుండా అటు సినిమాలు, ఇటు రియాల్టీ షోస్ అంటూ అభిమానులను, ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. తాజాగా బిగ్ బీ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా ఈవీ కారు వచ్చేసింది. ఈ లగ్జరీ కారును స్వయంగా డ్రైవ్ చేస్తూ కనిపించారు అమితాబ్.

Amitabh Bachchan: 83 ఏళ్ల వయసులో స్టీరింగ్ పట్టిన బిగ్ బి.. అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు స్టైల్ చూస్తే..
Amitabh Bachchan
Rajitha Chanti
|

Updated on: Oct 01, 2026 | 9:29 AM

Share

బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ గ్యారేజ్‌లో ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, అత్యధిక ధర కలిగిన లగ్జరీ కార్లు ఎన్నో ఉన్నాయి. రూ. కోట్లు విలువ చేసే వాహనాలు ఆయన సొంతం. అయితే సాధారణంగా అమితాబ్ స్వయంగా డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ తాజాగా ఆయన ముంబైలోని తన నివాసం వెలుపల స్వయంగా డ్రైవింగ్ చేస్తూ కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. అది కూడా ఏ లగ్జరీ పెట్రోల్, డీజిల్ కార్ కాకపోవడం విశేషం. 83 ఏళ్ల వయసులోనూ బిగ్ బి ఎంతో ఉత్సాహంగా స్వదేశీ తయారీ సంస్థ అయిన మహీంద్రాకు చెందిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (EV) ని నడుపుతూ కెమెరాలకు చిక్కారు. ఈ చిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‏తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..

అమితాబ్ కుటుంబానికి అత్యంత శక్తివంతమైన, అత్యంత ప్రీమియం ఎస్‌యూవీ అయిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఆక్టా (Land Rover Defender Octa) కూడా ఉంది. రూ. 2.59 కోట్ల రేంజ్‌లో ఉండే ఈ కారు 4.4 లీటర్ల ట్విన్-టర్బో V8 ఇంజిన్‌తో ఏకంగా 635 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3.8 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. అంతటి హై-పెర్ఫార్మెన్స్ లగ్జరీ కార్ ఉన్నప్పటికీ, రోజువారీ ప్రయాణానికి అమితాబ్ బచ్చన్ మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఎంచుకోవడం విశేషం.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..

మహీంద్రా సంస్థ రూపొందించిన ఈ ఫ్లాగ్‌‌షిప్ ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 650 కిలోమీటర్ల వరకు మైలేజ్ (రేంజ్) ఇస్తుంది. అలాగే, కేవలం 28 నిమిషాల్లోనే 10 నుండి 80 శాతం వరకు ఫాస్ట్ ఛార్జ్ అయ్యే సదుపాయం దీని సొంతం. ఇది రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికను అందిస్తుంది. ఒకటి 59 kWh యూనిట్, ఇది 400 కి.మీ.ల వరకు రేంజ్‌ను అందిస్తుంది, మరొకటి పెద్దదైన 79 kWh ప్యాక్, ఇది ఒకే ఛార్జ్‌పై 656 కి.మీ.ల వరకు ప్రయాణిస్తుంది. టాప్ వేరియంట్ 230 bhp , 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనితో ఇది సుమారు 7.9 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. XEV 9e ఆధునిక, టెక్నాలజీతో నిండిన క్యాబిన్‌ను కలిగి ఉంది. ఇందులో 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.8-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్, లెవెల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. ఇది 150 kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ చేస్తుంది. ఇటీవలి కాలంలో బాలీవుడ్ ప్రముఖులు ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువగా స్వీకరిస్తూ, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారతీయ బ్రాండ్ అయిన మహీంద్రా ఈవీని అమితాబ్ బచ్చన్ డ్రైవ్ చేయడం వల్ల భారత ఎలక్ట్రిక్ వాహన రంగానికి పెద్ద ఎత్తున ప్రచారం లభించినట్లైంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..

అమితాబ్ బచ్చన్ డ్రైవింగ్..

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..

Follow Us
అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..
అమితాబ్ గ్యారేజీలోకి కొత్త మహీంద్రా EV.. కొత్త కారు చూస్తే..
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని
ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా
విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా
చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..
చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..