AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : 13 ఏళ్ల తర్వాత ఓటీటీలో సంచలనం.. నెట్టింటిని ఊపేస్తున్న మాస్టర్ పీస్.. ప్రతి క్షణం ట్విస్టులే..

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ దుమ్మురేపుతున్నాయి. కొత్త సినిమాలు, ఒరిజినల్ వెబ్ సిరీస్ లు ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఒకప్పుడు థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలోనూ రిలీజ్ అవుతున్నాయి. తాజాగా 13 సంవత్సరాల క్రితం విడుదలైన ఓ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఆ చిత్రం చేసే సంచనలం గురించి చెప్పక్కర్లేదు.

Cinema : 13 ఏళ్ల తర్వాత ఓటీటీలో సంచలనం.. నెట్టింటిని ఊపేస్తున్న మాస్టర్ పీస్.. ప్రతి క్షణం ట్విస్టులే..
Shahid Movie
Rajitha Chanti
|

Updated on: Oct 01, 2026 | 8:55 AM

Share

ఈ రోజుల్లో కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏదో ఒక డిజిటల్ ప్లాట్‌‌ఫామ్‌లో సందడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ, ఒక అద్భుతమైన సినిమా, ఏకంగా రెండు జాతీయ అవార్డ్స్ గెలుచుకున్న ఒక మాస్టర్‌పీస్ డిజిటల్ స్ట్రీమింగ్‌లోకి రావడానికి ఏకంగా 13 ఏళ్లు పట్టిందంటే నమ్మగలరా? అవును, సినీ ప్రియులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆ నిజమైన సినిమా ‘షాహిద్’ (Shahid). బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో, హన్సల్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బయోపిక్ డ్రామా ఎట్టకేలకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. IMDbలో ఏకంగా 8.2/10 రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, ప్రస్తుతం ఓటీటీ లవర్స్ దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‏తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..

కథ విషయానికి వస్తే.. మానవ హక్కుల న్యాయవాది, యాక్టివిస్ట్ అయిన షాహిద్ అజ్మీ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. అన్యాయంగా తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు పాలైన నిరపరాధుల తరఫున కోర్టులో పోరాటం చేసిన ధీరుడు షాహిద్. ఎన్నో బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ వెరవక న్యాయం కోసం నిలబడిన ఆయన జీవితాన్ని అత్యంత సహజంగా, హృదయానికి హత్తుకునేలా దర్శకుడు తెరకెక్కించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..

ఈ సినిమాలో షాహిద్ అజ్మీ పాత్రలో రాజ్‌కుమార్ రావు నటన అద్భుతమనే చెప్పాలి. పాత్రలో ఆయన జీవించిన తీరుకుగాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. అలాగే హన్సల్ మెహతా ఉత్తమ దర్శకుడిగా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సినిమాలోని ప్రతీ సీన్, ప్రతి డైలాగ్ డ్రామాకు తావులేకుండా యథార్థ ఘటనలకు అత్యంత సమీపంగా సాగుతుంది. 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రంపై సినీ విశ్లేషకులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రతి సీన్ “వర్త్ వర్మ వర్త్” అనేలా సాగే ఈ రియలిస్టిక్ కోర్ట్‌‌రూమ్ డ్రామాను నాణ్యమైన సినిమాలు ఇష్టపడేవారు ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు!

ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..

ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..

Follow Us