AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2027 వన్డే వరల్డ్ కప్‌తో మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి.. అసలు మ్యాటర్ తెలిస్తే వావ్ అనాల్సిందే..?

ICC ODI World Cup 2027: మహాత్మా గాంధీ అడుగుజాడలున్న గడ్డపై ఆయన జయంతి రోజునే ఈ టోర్నీ మొదలైతే అటు భారతీయులకు, ఇటు ఆఫ్రికన్లకు అది ఎంతో గర్వకారణంగా నిలుస్తుంది. ఈ చారిత్రక క్రీడా పండుగ ఆఫ్రికా దేశాల క్రికెట్‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

2027 వన్డే వరల్డ్ కప్‌తో మహాత్మా గాంధీకి ఉన్న లింక్ ఏంటి.. అసలు మ్యాటర్ తెలిస్తే వావ్ అనాల్సిందే..?
Icc Odi World Cup 2027 Gandhi
Venkata Chari
|

Updated on: Aug 17, 2026 | 1:33 PM

Share

ICC ODI World Cup 2027: రాబోయే 2027 వన్డే ప్రపంచకప్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) సన్నాహాలు ముమ్మరం చేసింది. క్రికెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత సుదీర్ఘంగా సాగనున్న ఈ మెగా టోర్నీకి, మన జాతిపిత మహాత్మా గాంధీకి ఒక ఆసక్తికరమైన అనుబంధం ముడిపడి ఉండటం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఏడాది జరగనున్న ఈ మహా క్రికెట్ సంగ్రామానికి ఆఫ్రికా ఖండం వేదిక కాబోతోంది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఈ 2027 వన్డే ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. వాస్తవానికి ఈ టోర్నీని ముందుగా అక్టోబర్ 8వ తేదీన అట్టహాసంగా ప్రారంభించాలని ఐసీసీ ప్రాథమికంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ ఇప్పుడు ఆ తేదీని అక్టోబర్ 2వ తేదీకి మార్చే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కేవలం ఒకే ఒక ప్రత్యేక కారణం వల్లే ఈ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఎక్కువమంది చదివినది: 41 సిక్సర్లు, 39 ఫోర్లతో 487 పరుగులు.. భారీ ప్రపంచ రికార్డ్‌తో టీ20 హిస్టరీనే షేక్ చేశారుగా..!

బాపూజీకి.. ఆఫ్రికాకు ఉన్న కనెక్షన్ ఇదే..!

క్రికెట్ అనగానే మనకు సచిన్, ధోనీ, కోహ్లీ లాంటి దిగ్గజాలు గుర్తొస్తారు. మహాత్మా గాంధీ ఎప్పుడూ ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిన దాఖలాలు లేవు. మరి ఆయన జయంతి రోజున (అక్టోబర్ 2) అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈ ప్రతిష్టాత్మక టోర్నీని ఎందుకు ప్రారంభించాలనుకుంటోందనే సందేహం రాక మానదు. దీనికి అసలు కారణం దక్షిణాఫ్రికాతో బాపూజీకి ఉన్న విడదీయరాని అనుబంధమే.

ఇవి కూడా చదవండి

గాంధీజీ తన జీవితకాలంలో ఏకంగా 21 ఏళ్ల పాటు ఆఫ్రికా గడ్డపైనే గడిపారు. అక్కడి వర్ణ వివక్షపై ఆయన చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. ఇప్పుడు ఆ దేశం ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో.. బాపూజీకి ఘనమైన నివాళి అర్పించే ఉద్దేశంతోనే అక్టోబర్ 2వ తేదీన ఈ మెగా టోర్నీకి శ్రీకారం చుట్టాలని ఐసీసీ భావిస్తోంది.

క్రికెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ పోరు..

అక్టోబర్ 2న టోర్నీని ప్రారంభించినా, ముగింపు తేదీలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్ ముందుగా అనుకున్నట్లుగానే నవంబర్ 21వ తేదీన జరుగుతుంది. దీని ప్రకారం ఈ ప్రపంచకప్ ఏకంగా 50 రోజుల పాటు సుదీర్ఘంగా సాగనుంది. క్రికెట్ చరిత్రలో ఒక వరల్డ్ కప్ ఇన్ని రోజుల పాటు జరగడం ఇదే తొలిసారి. గతంలో 2003లో జరిగిన వన్డే ప్రపంచకప్ 47 రోజుల పాటు జరగడమే ఇప్పటివరకు ఉన్న రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును ఈ ఆఫ్రికా వరల్డ్ కప్ తిరగరాయనుంది.

ఎక్కువమంది చదివినది: IND vs ENG: ప్రపంచ రికార్డ్‌తో వైభవ్ బీభత్సం గుర్తుందా.. బుడ్డోడి ఊచకోతకు బలైన ఇంగ్లాండ్..!

12 మైదానాలు..

ఈ మెగా టోర్నీకి సంబంధించిన మ్యాచ్‌ల కోసం ఐసీసీ ఇప్పటికే వేదికలను ఖరారు చేసింది. మొత్తం 12 అద్భుతమైన మైదానాల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. సింహభాగం దక్షిణాఫ్రికాలోని 8 మైదానాలకు దక్కగా, జింబాబ్వేలోని 3 మైదానాలు, నమీబియాలోని కేవలం ఒక్క స్టేడియం మాత్రమే ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!