AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని ఘటన..

క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోరన్న భయమో, మరే ఇతర కారణమో గానీ... ఓ యువకుడు, పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడ్డారు. బాపట్ల జిల్లా కోనంకి గ్రామ శివారులోని చెరువులో దూకి ఇద్దరూ తనువు చాలించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్కూల్ వద్ద మొదలైన పరిచయం చివరకు చెరువు గట్టున విషాదాంతంగా ఎలా మారింది? అనేది తెలుసుకుందాం..

Andhra Pradesh: ఇంటి నుంచి పారిపోయిన ప్రేమ జంట.. పోలీసులు వెతుకుతుండగానే ఊహించని ఘటన..
Tragedy In Bapatla
Krishna S
|

Updated on: Oct 01, 2026 | 9:18 AM

Share

చిగురించిన పరిచయం క్షణికావేశంలో ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొంది. పెద్దలు తమ బంధాన్ని అంగీకరించరనే భయమో, మరే ఇతర కారణాల వలనో గానీ ఓ యువకుడు, మైనర్ బాలిక దారుణ నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లాలో మార్టూరు మండల పరిధిలోని కోనంకి గ్రామ శివారులో గల స్థానిక చెరువులోకి దూకి ఇద్దరూ ప్రాణాలు తీసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. గుంటూరు జిల్లా కాకుమాను గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు సమీపంలోని వల్లూరు గ్రామంలో నివాసముంటుండగా, విద్యాభ్యాసం నిమిత్తం బాలిక కాకుమానులోని తన తాతయ్య, అమ్మమ్మల సంరక్షణలో ఉంటూ బడికి వెళ్లేది.

ఆమె రోజూ వెళ్లే స్కూల్ బస్సుకు అదే గ్రామానికి చెందిన సాంబశివరావు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి కుమారుడు లావు విఘ్నేష్‌ (22) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. తండ్రి పనుల నిమిత్తం విఘ్నేష్ తరచూ ఆ పాఠశాల ప్రాంగణం వద్దకు రాకపోకలు సాగించేవాడు. ఈ క్రమంలోనే సదరు విద్యార్థినితో అతడికి పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల్లోనే ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ తరచూ మాట్లాడుకునేవారు.

కనిపించకుండా పోయిన జంట.. పోలీసుల ముమ్మర గాలింపు

ఈ నేపథ్యంలో ఈ నెల 29న ఉదయం వీరిద్దరూ ఎవరికీ చెప్పకుండా ఇళ్ల నుంచి అదృశ్యమయ్యారు. పాఠశాలకు వెళ్లిన మనవరాలు ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తాతయ్య, అమ్మమ్మ వల్లూరులో ఉన్న ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అంతటా గాలించినా ఆచూకీ దక్కకపోవడంతో కుటుంబ సభ్యులు కాకుమాను పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విఘ్నేష్ మొబైల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు బృందాలు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. కుటుంబ సభ్యులు, పోలీసులు తీవ్రంగా శ్రమించినప్పటికీ వారి జాడ దొరకలేదు.

బంధువులకు చివరి మెసేజ్.. చెరువులో లభ్యమైన మృతదేహాలు

అయితే బుధవారం ఉదయానికి వీరిద్దరూ మార్టూరు మండలం కోనంకి గ్రామ శివారులోని చెరువు వద్దకు చేరుకున్నారు. అక్కడ తీవ్ర ఆందోళనతో ఉన్న ఆ జంట, తాము బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఎలుకల మందు సేవించి, చెరువులోకి దూకేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో నీటిలో గాలింపు చేపట్టారు. తీవ్ర ప్రయత్నాల అనంతరం ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. అప్పటివరకు ప్రాణాలతో వస్తారని ఎదురుచూసిన కుటుంబసభ్యులు, వారి మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు.

కేసు పరిధిపై సందిగ్ధం.. దర్యాప్తు ముమ్మరం

పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే బాలిక అదృశ్యంపై ఇప్పటికే కాకుమాను పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై ఉండగా, మరణం మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కోనంకిలో సంభవించింది. దీంతో కేసు ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందనే అంశంపై ఉన్నతాధికారుల మార్గదర్శకాల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సీఐ శ్రీనివాసరావు వెల్లడించారు.

Follow Us