AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: జగనన్న ఇళ్ల పేరుతో కోట్లలో స్కామ్.. ప్రధాని మోడీకి స్వయంగా నివేదిక ఇస్తానన్న జనసేనాని..

ప్రభుత్వ అక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు..అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రకటించిన.. పవన్ ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తొలగించమని స్పష్టం చేశారు..

Pawan Kalyan: జగనన్న ఇళ్ల పేరుతో కోట్లలో స్కామ్.. ప్రధాని మోడీకి స్వయంగా నివేదిక ఇస్తానన్న జనసేనాని..
Pawan Kalyan
Surya Kala
|

Updated on: Nov 13, 2022 | 4:36 PM

Share

ఏపీలో జగనన్న ఇళ్ల పేరుతో పెద్ద స్కామ్ జరిగిందని ఆరోపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇళ్ల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నిధులు ఇస్తుంది..  నిధులు పక్కదారి పట్టాయన్నారు. ప్రభుత్వం చెప్పిన ధర ఒకటి ప్రభుత్వం పెద్దలు దోచుకుంది మరొకటి.. అసలు ఇళ్ల పేరుతో కేటాయించిన రూ. 23,400 కోట్లలో పెద్ద ఎత్తున దోపిడీ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు జనసేనాని. జగనన్న ఇళ్ల పేరుతో జరిగిన అవినీతిపై ప్రధాని మోదీకి స్వయంగా తానే  నివేదిక ఇస్తానని చెప్పారు. ప్రభుత్వ అక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని పిలుపునిచ్చారు..అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామని ప్రకటించిన.. పవన్ ప్రస్తుతం ఉన్న ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తొలగించమని స్పష్టం చేశారు..!

జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా గుంకలాంలో పర్యటించారు పవన్‌..YCP నేతలు ఢిల్లీకి వెళ్లి తనపై చాడీలు చెబుతున్నారని విమర్శించారు పవన్. తాను మాత్రం ఎక్కడి సమస్యలు అక్కడే తేలుస్తానని చెప్పారు..! కేసులు పెట్టినా.. చంపుతామని బెదిరించినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు..

జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు.. పేరుతో జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లాలోని గుంకలాంలో జగనన్న కాలనీని పవన్‌ పారిశీలించారు.  విశాఖ పట్నం నుంచి విజయనగరం వెళ్లే రహదారిలో పవన్‌కు అడుగడుగునా జనసేన నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. పవన్‌ను చూసేందుకు భారీగా అభిమానులు, జనసైనికులు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!