Andhra Pradesh: పాదయాత్రలు చేసినా.. పొర్లుదండాలు పెట్టినా ప్రజలు నమ్మరు.. ఎంపీ మోపిదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

దావోస్ లో కూర్చుని చంద్రబాబులాగా తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టే నైజం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని, ఈ వాస్తవాన్ని అంగీకరించేందుకు చంద్రబాబు, లోకేశ్ లు మానసికంగా సిద్ధపడాలని సూచించారు.

Andhra Pradesh: పాదయాత్రలు చేసినా.. పొర్లుదండాలు పెట్టినా ప్రజలు నమ్మరు.. ఎంపీ మోపిదేవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Mp Mopi Devi On Chandrababu
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2022 | 2:33 PM

టీడీపీ లీడర్ నారా లోకేశ్ పాదయాత్రపై ఎంపీ మోపిదేవి వెంకటరమణ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రం పారిశ్రామికంగా సంక్షేమంగా అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబుకు లోకేశ్ కు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. తాడేపల్లి నుంచి మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయం వరకు నడవలేని లోకేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తారా అని ఎద్దేవా చేశారు. లోకేశ్, చంద్రబాబులు ఎన్ని పాదయాత్రలు, పొర్లుదండాలు చేసినా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. లోకేశ్ చేపట్టబోయే పాదయాత్ర కడదాకా నడుస్తుందా, కార్పొరేట్ యాత్రల మధ్యలో ముగుస్తుందా అని మోపీ దేవి ప్రశ్నించారు. దావోస్ లో కూర్చుని చంద్రబాబులాగా తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టే నైజం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 లో మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని, ఈ వాస్తవాన్ని అంగీకరించేందుకు చంద్రబాబు, లోకేశ్ లు మానసికంగా సిద్ధపడాలని సూచించారు.

టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. 2023 జనవరి 27 నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు లోకేశ్‌ పాదయాత్ర చేపట్టనున్నారు. పాదయాత్ర మార్గం మధ్యలో ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుని, పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇందుకు సంబంధించిన రూట్‌ మ్యాప్‌ ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయనే ప్రకటించడంతో ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. దీంతో ఏడాది పాటు ప్రజల్లో ఉండేలా లోకేశ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక.. పాదయాత్ర చేపట్టి అధికారం కైవసం చేసుకున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, ఆయన బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. చంద్రబాబునాయుడు, వైఎస్ షర్మిల కూడా తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.