Turmeric: పసుపు వినియోగం కాలేయానికి ప్రమాదమా.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు

పసుపు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనాన్ని అందిస్తుందో మాటల్లో చెప్పలేం. అది ఇచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. భారతీయ వంటకాల్లో పసుపు వేయడం పూర్వకాలం నుంచే వస్తోంది. రంగు, రుచి తో పాటు అనేక రోగాలనూ నివారించే...

Turmeric: పసుపు వినియోగం కాలేయానికి ప్రమాదమా.. అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Turmeric
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 11, 2022 | 9:43 PM

పసుపు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనాన్ని అందిస్తుందో మాటల్లో చెప్పలేం. అది ఇచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. భారతీయ వంటకాల్లో పసుపు వేయడం పూర్వకాలం నుంచే వస్తోంది. రంగు, రుచి తో పాటు అనేక రోగాలనూ నివారించే ఔషధంగా పసుపును అభివర్ణిస్తుంటారు. అనేక రకాల జీర్ణాశయ సమస్యలను నివారించేందుకు భారతీయ ఆయుర్వేద వైద్యంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. అనేక వ్యాధులను దూరం చేయడంతో పాటు చర్మ నాణ్యతను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఓ సంచలన విశయాన్ని కనుగొన్నారు. పసుపును వాడటం వల్ల కాలేయ సమస్యలు వస్తాయని గుర్తించారు. 2011-2022 మధ్యకాలంలో పసుపు వినియోగించే వారిలో కాలేయ సమస్యలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధరించారు. కర్కుమిన్ అనేది పసుపులో ఉండే వర్ణద్రవ్యం. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కర్కుమిన్ పసుపుకు ప్రకాశవంతమైన పసుపు వర్ణద్రవ్యం ఇస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం.. ఆహారానికి రంగు, రుచిని అందించే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు ఉన్నాయి. ఇవి కాలేయంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయి.

కాలేయం అతిపెద్ద శరీర అవయవం. ఇది కొవ్వులను జీవక్రియ చేయడంతో పాటు నిల్వ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం పసుపు తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుందని గుర్తించారు. నాలుగు, ఎనిమిది వారాల విడతలుగా ఈ పరిశోధన నిర్వహించారు. వారికి ఇచ్చే ఆహారంలో పసుపును యాడ్ చేశారు. అలా తీసుకునే వారిలో కాలేయ సమస్యలు ఉత్పన్నమయ్యాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పరిశోధనలో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు నల్ల మిరియాలతో కలిపి పసుపును తీసుకున్నారు. ఇది జీర్ణక్రియకు సహకరించింది. కానీ కేవలం పసుపును తీసుకోవడం వల్ల సమస్యలు వచ్చాయి.

పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల విరోచనాలు, ఉబ్బరం, తలతిరగడం, తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. కర్కుమిన్ కొవ్వు కణాలు పెరగకుండా చేస్తుంది. పిత్తాశయ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు పసుపును వీలైనంత తక్కువగా తినాలి. బరువును బ్యాలెన్స్ చేయడంతో పాటు మొత్తం ఆరోగ్యాన్ని కాపాడడంలో పసుపు సహాయపడుతుంది. పసుపులోని కర్కుమిన్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. ఐరన్ లోపం ఉన్నవారు పసుపు తీసుకోపోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం