Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: అందుకే మైనార్టీ తోఫాకు పదో తరగతి ఉత్తీర్ణుల నిబంధన పెట్టాం.. సీఎం జగన్ కామెంట్స్..

మైనారిటీల సంక్షేమానికి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించారని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన తనయుడిగా తాను...

CM Jagan: అందుకే మైనార్టీ తోఫాకు పదో తరగతి ఉత్తీర్ణుల నిబంధన పెట్టాం.. సీఎం జగన్ కామెంట్స్..
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy
Follow us
Ganesh Mudavath

|

Updated on: Nov 11, 2022 | 9:19 PM

మైనారిటీల సంక్షేమానికి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించారని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన తనయుడిగా తాను రెండడుగులు ముందుకేశానని చెప్పారు. మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. పదవుల నుంచి సంక్షేమ పథకాల వరకు అన్ని విధాలా మైనార్టీలకు న్యాయం చేస్తున్నామని వివరించారు. మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత తమదేనని ముఖ్యమంత్రి చెప్పారు. నలుగురికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో పాటు.. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవిని కేటాయించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతీ ముస్లిం ప్రపంచంతో పోటీ పడాలన్న సీఎం జగన్..విద్యావ్యవస్థలో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించారు. వక్ఫ్‌ ఆస్తులు కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం మీది అనే విషయాన్ని మర్చిపోవద్దు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు.

మూడేళ్లలో మైనార్టీలకు డీబీటీ ద్వారా రూ.10,309 కోట్లు అందించాం. నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ. 10వేల కోట్లు అందించాం. ప్రతీ ముస్లిం విద్యావంతుడు కావాలి. మైనార్టీల సంక్షేమంలో 2019 తర్వాత గణనీయమైన మార్పులు వచ్చాయి. గత ప్రభుత్వంలో మైనార్టీలకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ముస్లిం ఆడపిల్లలు చదువులో వెనకబడకూడదు. అందుకే మైనార్టీ తోఫాకు పదో తరగతి ఉత్తీర్ణులు కావాలని నిబంధన పెట్టాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది.

– వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మరోవైపు.. రాష్ట్రంలో అతిపెద్ద సుగంధ ద్రవ్యాల తయారీ ప్లాంట్‌ ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడులో గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ ద్వారా వేలాది మంది రైతులకు మేలు జరగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. దాదాపు రూ. 200 కోట్ల పెట్టుబడితో ఏటా 20 వేల మెట్రిక్‌ టన్నుల మిర్చితో పాటు మరో 15 రకాల సుగంధ ద్రవ్యాలను ప్రాసెస్‌ చేసి ఇక్కడ నుంచి ఎగుమతి చేసేలా ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1500 మంది ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం జగన్ చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..