Big News Big Debate: కాకరేపుతోన్న మోదీ విశాఖ పర్యటన.. అటు బీజేపీ, ఇటు వైసీపీ మధ్యలో జనసేన..
మరికొద్ది నిమిషాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖపట్నంలో అడుగుపెడుతున్నారు. గతంలోనూ పలు సందర్బాల్లో ఏపీకి వచ్చినప్పటికీ ఎప్పుడూ లేనంత హైటెన్షన్.. రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ అటెన్షన్ ఇప్పుడు ఎక్కువుగా కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో కలిసి లెఫ్ట్..
మరికొద్ది నిమిషాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖపట్నంలో అడుగుపెడుతున్నారు. గతంలోనూ పలు సందర్బాల్లో ఏపీకి వచ్చినప్పటికీ ఎప్పుడూ లేనంత హైటెన్షన్.. రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ అటెన్షన్ ఇప్పుడు ఎక్కువుగా కనిపిస్తోంది. స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో కలిసి లెఫ్ట్ పార్టీలు నిరసన బాట పట్టగా.. ప్రధాని టూరు సక్సెస్ చేయడానికి అధికారపార్టీ వారం రోజులుగా తెగ కష్టపడుతోంది. ఇక ఆ గట్టో.. ఈ గట్టో తెల్చుకోలేకపోతున్న జనసేన కూడా ప్రధానమంత్రి ఇచ్చే రోడ్‌మ్యాప్ కోసం ఎదురుచూస్తోంది. బహిరంగంగా చెప్పకపోయినా 2014 పొత్తులు రిపీట్ కావాలని కోరుకుంటున్న టీడీపీ కూడా ఈ టూరులో లెఫ్ట్ పార్టీల ఉద్యమానికి దూరంగా జరిగి బీజేపీకి దగ్గరవుతామని సంకేతాలు ఇస్తోంది. సభ సక్సెస్ చేసి మోదీ వద్ద మార్కులు కొట్టేయడానికి వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
విశాఖపట్నంలో పార్టీలకతీతంగా జరుగుతున్న ప్రధాని టూరు విజయవంతం చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం జరిగే సభకు లక్షలమందిని తరలిస్తోంది. వైసీపీ తన సొంత కార్యక్రమంగా భావించి అంతా ముందుకొచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే విభజన హామీలు అమలు చేయకపోగా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ అమ్మబోమని మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు. అవసరం అయితే టూరు అడ్డుకుంటామని పిలుపునిచ్చాయి లెఫ్ట్ పార్టీలు. దీంతో నగరంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విభజన హామీలు అమలు చేయకపోయినా మోదీ సభకు ప్రభుత్వం ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఉద్యమాల సంగతి అటుంచితే.. రాజకీయంగానే జరుగుతున్న చర్చే ఎక్కువుగా ఉంది. పవన్ కల్యాణ్‌తో భేటి ఉంటుందన్న వార్త ఒక్కసారిగా పొలిటికల్ కాక రేపింది. పొత్తులో ఉన్నా వ్యూహాలు మార్చుకుంటామన్న పవన్ ఇటీవల చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అనూహ్యంగా ప్రధాని టూరులో జనసేన అధ్యక్షుడు పవన్‌కు పిలుపు రావడంతో మళ్లీ పొత్తులపై చర్చ మొదలైంది. రోడ్‌మ్యాప్ అడుగుతున్న పవన్ కల్యాణ్‌కు మోదీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందంటున్నాయి బీజేపీ-జనసేన శ్రేణులు. అయితే అటు టీడీపీ, వైసీపీ జరుగుతున్న పరిణామాలపై భిన్నస్వరాలు వినిపిస్తున్నారు.
మోదీ ఏపీకి రావడం కొత్తకాదు.. కానీ రాజకీయాలకే కేంద్రబింధువుగా మారిన విశాఖ రావడం ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. వికేంద్రీకరణ నినాదం అందుకున్న వైసీపీ ప్రధాని సభను కూడా అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది. ఇక లెఫ్ట్ పార్టీలు తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక రాజకీయంగానూ లబ్ధి కోసం వ్యూహాలు రచిస్తున్నారు. మరి ఎవరి లక్ష్యం నేరవేరుతుందో.. మరెవరికి నిరాశ ఎదరువుతుందో చూడాలి.
– బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ డెస్క్.
ఇదే అంశానికి సంబంధించి ఇవాళ్టి బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ విత్ రజనీకాంత్‌లో డిబేట్ నిర్వహించారు. ఆ లైవ్ వీడియో దిగువన చూడండి..
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..