Andhra Pradesh: ఘాట్ రోడ్డులో లారీ బోల్తా.. రోడ్డుపై చెల్లాచెదురుగా చేపలు.. అసలు విషయం ఏంటంటే..
రోడ్డుపై సరకుల లోడ్ తో వెళ్తున్న వాహనాలు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కు గురైతే.. కొందరు మానవత్వాన్ని మర్చిపోయి ఆ సరకంతా లూటీ చేసేస్తుంటారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం ఎన్నో చూశాం. వంట నూనె, పెట్రోల్,...
రోడ్డుపై సరకుల లోడ్ తో వెళ్తున్న వాహనాలు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కు గురైతే.. కొందరు మానవత్వాన్ని మర్చిపోయి ఆ సరకంతా లూటీ చేసేస్తుంటారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం ఎన్నో చూశాం. వంట నూనె, పెట్రోల్, మద్యం, చేపలు ఇలా ఒక్కటేమిటి.. ఆ వెహికిల్ లో ఏమున్నా క్షణంలో మాయం చేసేస్తుంటారు. ఇప్పుడు కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. పశ్చిమగోదావరి నుంచి ఒడిశాకు చేపల లోడ్ తో వెళ్తున్న లారీ మారేడుమిల్లి ఘాట్ వద్ద బోల్తా పడింది. దీంతో లారీలోని చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. కాగా పడిపోయిన చేపలన్నీ క్యాట్ ఫిష్ రకానికి చెందినవి. వీటిని రాష్ట్రంలో నిషేదించారు. అయినా ఒడిశాకు అక్రమంగా రవాణా చేస్తున్న సమయంలో లారీ బోల్తా పడింది. చట్టవిరుద్ధం కావడంతో లారీ డ్రైవర్, చేపలు రవాణా చేస్తున్న వారు ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.
చేపలు రోడ్డు మీద పడడంతో రోడ్ మీద వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలు ముందుకు వెనకకు వెళ్లకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. బీర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడితే బీర్ బాటిల్స్ ఎత్తుకు వెళ్లడం, ఆయిల్ లారీ బోల్తా పడితే బకెట్ల కొద్దీ ఆయిల్ తీసుకెళ్లడం వంటి అనేక ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..