PM Modi: మోదీతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటి.. 25 నిమిషాలకు పైగా కొనసాగిన మీటింగ్

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Nov 11, 2022 | 9:25 PM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖపట్నంలో అడుగుపెడుతున్నారు. గతంలోనూ పలు సందర్బాల్లో ఏపీకి వచ్చినప్పటికీ ఎప్పుడూ లేనంత హైటెన్షన్‌..



ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖపట్నంలో అడుగుపెడుతున్నారు. గతంలోనూ పలు సందర్బాల్లో ఏపీకి వచ్చినప్పటికీ ఎప్పుడూ లేనంత హైటెన్షన్‌.. రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్‌ అటెన్షన్‌ ఇప్పుడు ఎక్కువుగా కనిపిస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలతో కలిసి లెఫ్ట్‌ పార్టీలు నిరసన బాట పట్టగా.. ప్రధాని టూరు సక్సెస్‌ చేయడానికి అధికారపార్టీ వారం రోజులుగా తెగకష్టపడుతోంది. ఇక ఆ గట్టో.. ఈ గట్టో తెల్చుకోలేకపోతున్న జనసేన కూడా ప్రధానమంత్రి ఇచ్చే రోడ్‌మ్యాప్‌ కోసం ఎదురుచూస్తోంది. బహిరంగంగా చెప్పకపోయినా 2014 పొత్తులు రిపీట్‌ కావాలని కోరుకుంటున్న టీడీపీ కూడా ఈ టూరులో లెఫ్ట్‌ పార్టీల ఉద్యమానికి దూరంగా జరిగి బీజేపీకి దగ్గరవుతామని సంకేతాలు ఇస్తోంది. సభ సక్సెస్‌ చేసి మోదీ వద్ద మార్కులు కొట్టేయడానికి వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu