Andhra Pradesh: ఆనందం అంతలోనే ఆవిరి.. పాల ట్యాంకర్ ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం..
మరికొద్ది సమయంలో ఇంటికి చేరుతామన్న ఆనందం వారిలో ఎంతో సమయం నిలవలేదు. అతి వేగం, త్వరగా ఇంటికి వెళ్లాలనే ఆతృతతో ఏకంగా మృత్యు ఒడికి చేరుకున్నారు. పాల ట్యాంకర్ ను ఓవర్ టేక్ చేయబోయి దుర్మరణం...
మరికొద్ది సమయంలో ఇంటికి చేరుతామన్న ఆనందం వారిలో ఎంతో సమయం నిలవలేదు. అతి వేగం, త్వరగా ఇంటికి వెళ్లాలనే ఆతృతతో ఏకంగా మృత్యు ఒడికి చేరుకున్నారు. పాల ట్యాంకర్ ను ఓవర్ టేక్ చేయబోయి దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐరాల మండలం కాణిపాకంపట్నం వద్ద పాల ట్యాంకర్, కారు ఢీ కొన్నాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తిరుపతి – బెంగళూరు 6 లైన్ల రహదారిలో ఈ యాక్సిడెంట్ జరిగింది. పాల ట్యాంకర్ ను ఓవర్ టేక్ చేయబోయి.. వెనుక వైపు నుంచి కారు ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతతో కారు నుజ్జు నుజ్జయింది. కారులోనే మృతదేహాలు చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరగడంతో తిరుపతి – బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
మరో ఘటనలో ఓ యువకుడు విద్యుదాఘాతంతో చనపోయాడు. శ్రీకాళహస్తి మండలం ఇసుకగుంట సమీపంలోని రేణిగుంట- నాయుడుపేట రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పవన్ కుమార్ రహదారి నిర్మాణ పనుల్లో కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వంతెన నిర్మాణ పనుల్లో ఉండగా విద్యుత్తు తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ఏపీ న్యూస్ కోసం