Pawan Kalyan: కారు టాప్ పైకి ఎక్కి ప్రయాణించిన పవన్ కల్యాణ్.. కేసు బుక్ చేసిన తాడేపల్లి పోలీసులు
పవన్‌పై కేసు బుక్కయ్యింది. ఆయన కార్ టాప్ ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణించడంపై ఫిర్యాదు అందడంతో తాడేపల్లి స్టేషన్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.
ఇటీవల ఏపీ రాజకాయాల్లో పవన్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. విశాఖ, ఇప్పటం పర్యటనల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పవన్‌ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇప్పుడం వెళ్లిన సమయంలో పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు పవన్. తనను ఆపే ప్రయత్నం చేయడంతో.. పార్టీ కార్యాలయం నుంచి కాలి నడకన ఇప్పటం వెళ్లే ప్రయత్నం చేశారు. ఆపై కారుపైకి ఎక్కి ప్రయాణించారు. కారు వేగంగా దూసుకుపోతున్నా కూడా ఆయన కాళ్లు బారజాపుకుని అలానే కూర్చిండిపోయారు. ఇలా టాప్ పైకి ఎక్కి ప్రమాదకరంగా ప్రయాణించడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, హైవేపై పలు వాహనాలు పవన్ కాన్వాయ్‌ను అనుసరించడం వంటి కారణాలు చూపిస్తూ శివకుమార్ అనే వ్యక్తి తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఐపీసీ 336, రెడ్ విత్ 177MV కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరి దీనిపై జనసేన శ్రేణులు ఎలా స్పందిస్తారన్నది చూడాలి.
విశాఖ వచ్చి ప్రధానిని కలిసిన పవన్
అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిమిత్తం విశాఖకు వచ్చిన ప్రధాని మోదీతో జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ భేటీ అయ్యారు. ఇద్దరి మధ్య దాదాపు 40 నిమిషాలు చర్చలు సాగాయి. సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్… మోదీతో రాష్ట్రానికి మంచి భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నానని తెలిపారు. మోదీతో భేటీ ఉంటుందని.. రెండు రోజుల క్రితం పీఎంవో నుంచి కాల్ వచ్చిందని అన్నారు. 8 ఏళ్ల తర్వాత మోదీని కలిశానని అన్నారు. ప్రధాని మోదీ ఏపీ రాష్ట్రం గురించి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారని పవన్ తెలిపారు.
35 నిమిషాలకుపైగా కొనసాగిన మోదీ-పవన్ భేటీలో ఏం జరిగింది. కానీ ఏం మాట్లాడారో, ఏమైనా కన్‌క్లూజన్ వచ్చిందో లేదో మాత్రం చెప్పని పవన్ కల్యాణ్.. ఏపీకి మంచి రోజులు రావచ్చంటూ నర్మగర్భంగా మాట్లాడారు. 8ఏళ్ల తర్వాత ప్రధానితో భేటీ అయ్యానన్నారు పవన్. ఏపీ బాగుండాలన్నదే తమ ఇద్దరి ఆక్షాంక్ష అని.. ఆ క్రమంలోనే ఇక మంచిరోజులు రావచ్చన్నారు. ఇంతకీ మోదీ, పవన్ ఏం మాట్లాడారు? అడిగిన రూట్ మ్యాప్ మోదీ ఇచ్చారా? లోకల్ బీజేపీతో ఉన్న సమస్యలను గతంలో పవన్ లేవనెత్తారు. ఇవే సమస్యలు మోదీ ముందు కూడా ఉంచారా? అవే అంశాలపై మోదీ, బీజేపీ నేతల నుంచి క్లారిటీ తీసుకుంటున్నారా ! ఏపీ రాజకీయంలో ఇప్పుడిదో హాట్ టాపిక్. మీటింగ్ తర్వాత బీజేపీ నేతలు కూడా మీడియాతో మాట్లాడిన తర్వాత, లేదంటే పవన్ డీటేల్డ్‌గా ప్రెస్‌మీట్ పెడితోనే ఈ అంశాలపై క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..