AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ జైల్లో 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవి, 35 మందికి టీబీ.. టెన్షన్‌లో అధికార యంత్రాంగం..!

కొత్త ఖైదీలు జైలుకు వచ్చినప్పుడు ఇలాంటి టెస్టులు మామూలుగానే నిర్వహిస్తారు. ఈ సంఖ్య దాదాపు 125-150గా ఉంటుంది. వీరిలో అధిక సంఖ్యలో ఖైదీలు డ్రగ్స్‌కు బానిసలని చెప్పారు.

ఆ జైల్లో 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవి, 35 మందికి టీబీ.. టెన్షన్‌లో అధికార యంత్రాంగం..!
Ghaziabad Dasna Jail
Jyothi Gadda
|

Updated on: Nov 17, 2022 | 8:16 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. దస్నా జైలులో 140 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టుగా అధికారులు వెల్లడించారు..మొత్తం 5500 మంది ఖైదీల ఆరోగ్య పరీక్షలో 140 మంది ఖైదీలకు హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (హెచ్‌ఐవి) పాజిటివ్‌గా తేలిందని వారు స్పష్టం చేశారు. జైలు సామర్థ్యం 1704 కాగా, ఐదు వేల మందికి పైగా ఖైదీలను ఈ జైలులో ఉంచారు. ఖైదీల సాధారణ ఆరోగ్య పరీక్షలు, స్క్రీనింగ్ సమయంలో మరో 35 మంది ఖైదీలకు టీబీ కూడా ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు అధికారి తెలిపారు. రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ద్వారా హెచ్‌ఐవీ రోగులకు చికిత్స అందిస్తున్నారు. 140 మంది ఖైదీలు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా ఉన్నారనే వార్తతో జైలు యంత్రాంగంలో కలకలం రేపింది. అనంతరం ఖైదీలందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. HIV అనేది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసే ఒక వైరల్ వ్యాధి. సకాలంలో చికిత్స చేయకపోతే HIV అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ (AIDS)కి దారితీస్తుంది.

దస్నా జైలు సూపరింటెండెంట్ అలోక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ… సాధారణ ప్రక్రియ ప్రకారం వైద్య పరీక్షలు జరుగుతాయని, ఇందులో హెచ్‌ఐవి నిర్ధారణ అయిందని చెప్పారు. హెచ్‌ఐవీ అంటరానితనం వల్ల వచ్చే వ్యాధి కాదని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. ఇది స్పర్శ ద్వారా వ్యాపించదు. ప్రభుత్వ సూచనల మేరకు ఈ ఖైదీలందరినీ సాధారణ ఖైదీలతో పాటు ఉంచుతారు. ప్రస్తుతానికి భయపడాల్సిన పనిలేదు. ఇది రొటీన్ పని. రోజూ తనిఖీలు చేస్తున్నారు. కొత్త ఖైదీలు జైలుకు వచ్చినప్పుడు ఇలాంటి టెస్టులు మామూలుగానే నిర్వహిస్తారు. ఈ సంఖ్య దాదాపు 125-150గా ఉంటుంది. వీరిలో అధిక సంఖ్యలో ఖైదీలు డ్రగ్స్‌కు బానిసలని చెప్పారు. డ్రగ్స్ కోసం వాడే సిరంజీలను వాడడం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. 35 మంది టిబి రోగులను విడిగా ఏర్పాటు చేసి ఉంచారు. అక్కడ వారు చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు, దీనికి ముందు అజంగఢ్‌లోని హైటెక్ జైలులో ఖైదీలకు హెచ్‌ఐవి పరీక్షలు నిర్వహించారు. కాగా, జైలులో ఉన్న పది మంది ఖైదీలు హెచ్‌ఐవి పాజిటివ్‌గా గుర్తించారు. చాలా మంది ఖైదీలు టెస్ట్‌లు జరగకుండా తప్పించుకుంటున్నారు. అజంగఢ్ జైలులో మొత్తం 2500 మంది మహిళా, పురుష ఖైదీలు ఉన్నారు. 1,322 మంది ఖైదీలను విచారించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ విషయమై చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఐఎన్ తివారీ మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాల మేరకు ఖైదీలకు హెచ్‌ఐవీ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మొత్తం 10 మంది రోగులు హెచ్‌ఐవి పాజిటివ్‌గా గుర్తించారు. అందరినీ సాధారణ ఖైదీల మాదిరిగానే ఉంచారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?
బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?