Astrology: సూర్యుడు, శుక్రుడి కలయికతో పలు రాశుల వారికి కష్టాలు షురూ..! డబ్బు నష్టం తప్పదు జాగ్రత్త..!!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు, సూర్యుడు ఒకరికొకరు శత్రువులుగా భావిస్తారు. ఒక గ్రహం సూర్యుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా దాని అన్ని ఫలాలను కోల్పోతుందని నమ్ముతారు.

Astrology: సూర్యుడు, శుక్రుడి కలయికతో పలు రాశుల వారికి కష్టాలు షురూ..! డబ్బు నష్టం తప్పదు జాగ్రత్త..!!
Astrology
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 17, 2022 | 7:48 PM

జ్యోతిశాస్త్రం ప్రకారం.. శుక్రుడి సంచారం మెుత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. శుభాలను ఇచ్చే గ్రహం శుక్రుడు. ఎవరి జాతకంలో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రతి నెలా గ్రహాలు, రాశులలో మార్పులు సంభవిస్తుంటాయి. నవంబర్ నెలలో గ్రహాలు, రాశుల గమనంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ మార్పుల వల్ల రాశిచక్రం మీద మంచి, చెడు ప్రభావాలు రెండూ కనిపిస్తాయి. ఈ మాసంలో అతి పెద్ద మార్పు ఏమిటంటే శుక్రుడు, సూర్యుడు వృశ్చికరాశిలో బుధుడు కలిసి ఉండటం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు, సూర్యుడు ఒకరికొకరు శత్రువులుగా భావిస్తారు. ఒక గ్రహం సూర్యుని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా దాని అన్ని ఫలాలను కోల్పోతుందని నమ్ముతారు. వృశ్చిక రాశిలోనూ ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయి. అందుకే శుక్రుడు, సూర్యుని కలయిక ప్రభావం అన్ని రాశుల మీద కూడా కనిపిస్తుంది. శుక్రుడు, సూర్యుని కలయిక ప్రభావం వల్ల ఏ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.

1. మేషం.. మేషరాశి వారు శుక్రుడు, సూర్యుని కలయికతో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మేష రాశి వారు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో గుండెకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఈ సమయంలో మేషరాశి వారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకూడదు. అది వారికి హాని చేస్తుంది. కార్యాలయంలో కూడా సహోద్యోగులతో వివాదాలు తలెత్తవచ్చు. వ్యాపారంలో భారీ నష్టం జరగవచ్చు. ఈ సమయంలో కూడా మీ మాట దురుసుతనం అదుపులో పెట్టుకోవటం మంచిది.

2. మిథునరాశి.. శుక్రుడు, సూర్యుని కలయిక మిథునరాశి వారికి చాలా ప్రమాదకరమని నిరూపించవచ్చు. ఈ సమయంలో మిధున రాశి వారు వాదనలు, వాగ్వాదాలు లేదా గొడవల నుండి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కోర్టు కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణంలో గాయాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో వ్యాపారంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

ఇవి కూడా చదవండి

3. కర్నాటకం.. కర్కాటక రాశి వారు కూడా శుక్ర, సూర్య కలయిక విషయంలో జాగ్రత్త అవసరం. భాగస్వామితో వాగ్వాదం జరిగే అవకాశం ఉన్నందున ప్రేమ సంబంధాలు ఉన్నవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో వ్యాపార లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు జరిగే అవకాశం పొంచివుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి