Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holy Ganga Jal: ఇంట్లో గంగాజలాన్ని ఎక్కడ, ఏ పాత్రలో ఉంచాలి.. 8 ముఖ్యమైన నియమాలను తెలుసుకోండి..

హిందూ పండుగలలో.. భారీ సంఖ్యలో ప్రజలు స్నానం చేయడం కోసం దానది కార్యక్రమాల కోసం గంగా తీరానికి చేరుకుంటారు. అంతేకాదు..గంగా జలాన్ని అత్యంత పవిత్రంగా ఒక పాత్రలో ఇంటికి తీసుకువస్తారు. అయితే ఈ గంగాజలాన్ని ఇంటిలో ఎక్కడ ఉంచాలి, ఏ పాత్రలోఉంచాలి అని తెలుసుకుని ఉండాలి.

Holy Ganga Jal: ఇంట్లో గంగాజలాన్ని ఎక్కడ, ఏ పాత్రలో ఉంచాలి.. 8 ముఖ్యమైన నియమాలను తెలుసుకోండి..
Ganga Water Remove Vastu Dosh
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2022 | 8:43 PM

హిందూ మతంలో గంగాజలానికి పవిత్ర స్థానం ఉంది. భారతదేశం ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావ సంబంధం ఉంది.  నీరుని సంస్కృతంలో గంగ అని పిలుస్తారు. గంగా నదిని “గంగమ్మ తల్లి, పావన గంగ,   గంగా భవాని అంటూ హిందువులు స్మరిస్తారు. హిందువులు తాము జరిపే పూజాదికార్యక్రమాలకే కాదు.. మతపరమైన కార్యక్రమాలకు కూడా గంగాజలాన్ని వినియోగిస్తారు. పవిత్రమైన గంగానదిలో స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని విశ్వాసం. అన్ని రకాల హిందూ పండుగలలో.. భారీ సంఖ్యలో ప్రజలు స్నానం చేయడం కోసం దానది కార్యక్రమాల కోసం గంగా తీరానికి చేరుకుంటారు. అంతేకాదు..గంగా జలాన్ని అత్యంత పవిత్రంగా  ఒక పాత్రలో ఇంటికి తీసుకువస్తారు. అయితే ఈ గంగాజలాన్ని ఇంటిలో ఎక్కడ ఉంచాలి, ఏ పాత్రలోఉంచాలి అని తెలుసుకుని ఉండాలి. గంగా జలానికి సంబంధించిన ముఖ్యమైన నియమాలు, చర్యలను తెలుసుకుందాం.

గంగాజలానికి సంబంధించిన 8 ముఖ్యమైన నియమాలు:

  1. శరీరాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేసే గంగాజలాన్ని ఎప్పుడూ అపవిత్ర ప్రదేశంలో ఉంచకూడదు.
  2. పూజ సమయంలో సంకల్పంలో ఉపయోగించే గంగాజలాన్ని ఎల్లప్పుడూ కంచు లేదా రాగి పాత్రలో ఉంచాలి.
  3. గంగాజలాన్ని ఎప్పుడూ ప్లాస్టిక్ పాత్రలో నిల్వ చేయరాదు.
  4. గంగాజలాన్ని మురికి చేతులతో లేదా బూట్లు, చెప్పులు ధరించి ఎప్పుడూ తాకకూడదు.
  5. గంగాజలాన్ని ఎప్పుడూ చీకటి ప్రదేశంలో ఉంచరాదు.
  6. అత్యంత పవిత్రమైనది, పూజనీయమైనదిగా పరిగణించబడే గంగాజలాన్ని ఎల్లప్పుడూ మీ ఇంటి ఈశాన్య మూలలో, అంటే పూజగదిలో లేదా దాని సమీపంలో ఉంచాలి.
  7. గంగాజలం తక్కువ పరిమాణంలో ఉన్నట్లయితే, మీరు దానిని పూజకు లేదా స్నానానికి నీటిలో కలిపి గంగాజలం వలె ఉపయోగించవచ్చు.
  8. గంగాజలాన్ని తాకి ఎప్పుడూ అబద్ధం ఆడకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు.

గంగా జలానికి సంబంధించిన 4 అద్భుత నివారణలు చర్యలు:

ఇవి కూడా చదవండి
  1. ప్రతిరోజు భగవంతుని పూజించే ముందు, దేవతలను గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి. అంతేకాదు స్నానము చేసే సమయంలో రోజూ నీటిలో గంగాజలాన్ని వినియోగించాలి.
  2. శివుని ఆరాధనలో గంగాజలం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఒక వ్యక్తి ప్రతిరోజూ శివలింగాన్ని గంగాజలంతో అభిషేకం చేస్తే భోళాశంకరుడు వెంటనే ఆశీర్వదించి.. భక్తుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని విశ్వాసం.
  3. ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించిందని లేదా ఏదైనా చెడు జరుగుతూనే శకునం కలుగుతుందని మీరు భావిస్తే, మీరు ప్రతిరోజూ మీ ఇంటిలోని ప్రతి మూలలో పవిత్ర గంగాజలాన్ని చల్లుకోవాలి.
  4. గంగాజలం చల్లడం వల్ల ఇంటిమీద చేదు దృష్టి, చెడు కలలు రాకుండా ఉంటాయని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)