Election Winning Temples: ఎన్నికల సమయంలో ఈ ఆలయాల్లో భక్తుల రద్దీ.. ఇక్కడ పూజలు చేస్తే విజయం ఖాయమని నమ్మే రాజకీయ నేతలు ..

ముఖ్యంగా దేశంలో ఎన్నికల వేళ ఈ ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి నాయకుడు తన విజయాన్ని కాంక్షిస్తూ దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలకు చేరుకొని పూజిచడం ప్రారంభిస్తాడు. ఈరోజు దేశంలోని ప్రముఖ దేవాలయాల గురించి.. ఈ ఆలయంలో పూజలు చేసే నాయకుడికి విజయం తధ్యమని నమ్మకం.

Election Winning Temples: ఎన్నికల సమయంలో ఈ ఆలయాల్లో భక్తుల రద్దీ.. ఇక్కడ పూజలు చేస్తే విజయం ఖాయమని నమ్మే రాజకీయ నేతలు ..
Election Winning Temples
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2022 | 8:40 PM

హిందూమతంలో దేవతలు కొలువైన ఆలయాలను దేవాలయాలుగా..  అత్యంత పవిత్రమైన, ఆరాధించదగిన ప్రదేశాలుగా పరిగణించబడుతున్నాయి. భక్తి, విశ్వాసంతో దేవతలను ఆరాధిస్తారుపూజిస్తారు. హిందూ మతంతో సంబంధం ఉన్న వ్యక్తులు తమకు ఏ చిన్న కష్టం వచ్చినా,ఇబ్బంది కలిగినా కోరికలు తీరాలన్నా వెంటనే దేవుళ్లను ఆశ్రయిస్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్తాడు. తీర్ధయాత్రను చేయడం ద్వారా కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా దేశంలో ఎన్నికల వేళ ఈ ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి నాయకుడు తన విజయాన్ని కాంక్షిస్తూ దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలకు చేరుకొని పూజిచడం ప్రారంభిస్తాడు. ఈరోజు దేశంలోని ప్రముఖ దేవాలయాల గురించి.. ఈ ఆలయంలో పూజలు చేసే నాయకుడికి విజయం తధ్యమని నమ్మకం.

1.శ్రీరాముడి ఆలయం, అయోధ్య

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఉన్న శ్రీరాముడి ఆలయం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం రాంలాలా ఆలయాన్ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఆలయాన్ని సందర్శించి పూజించిన వ్యక్తికి శ్రీరాముని సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఎన్నికల వేళ చిన్నా పెద్దా నాయకులంతా ఇక్కడికి భారీ సంఖ్యలో వస్తుంటారు.

ఇవి కూడా చదవండి

2. కామాఖ్య దేవాలయం, అస్సాం

అస్సాంలోని నీలాంచల్ కొండపై ఉన్న కామాఖ్య ఆలయం 51 శక్తిపీఠాలలో అత్యంత ప్రసిద్ధ దేవాలయంగా పరిగణించబడుతుంది. భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఈ ఆలయానికి వెళ్ళితే తప్పకుండా నెరవేరుతుందని విశ్వాసం. అమ్మవారి దర్శనం చేసుకుని తంత్ర-మంత్రం ద్వారా కోరికలను నెరవేర్చడానికి ప్రసిద్ధి చెందింది. ఎన్నికల సమయంలో చాలా మంది పెద్ద, ప్రముఖ నాయకులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలను చేస్తారు. అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన ఏ భక్తుడు ఖాళీ చేతులతో వెళ్లడని నమ్ముతారు.

3. మహాకాల్ ఆలయం, ఉజ్జయిని

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలోని మహాకాల్ దేవాలయం అన్ని కష్టాలను తొలగించి, కోరికలు తీరుస్తుందని అంటారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో త్రిమూర్తుల్లో ఒకరైన లయకారుడు శివయ్య దక్షిణ ముఖంగా శివలింగం స్థాపించబడింది. శ్రీ మహాకాళేశ్వరుడుని నిండుహృదయంతో ఆరాధించే భక్తుడు.. పనులన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయని నమ్ముతారు. ప్రధానమంత్రి నుండి సెంట్రీ వరకు శ్రీ మహాకాళేశ్వరుడుని పూజించడానికి ఇది కారణం. కామాఖ్య దేవాలయం వలె, మహాకాల్ నగరం కూడా తంత్ర-మంత్ర సాధన కోసం చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.

4. మా వింధ్యవాసిని, మీర్జాపూర్

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో ఉన్న వింధ్యవాసిని అమ్మవారి ఆలయంలోని సిద్ధపీఠం అన్ని కోరికలను తీర్చేదిగా పరిగణించబడుతుంది. వింధ్యవాసిని ఆస్థానానికి ఎవరు వచ్చి పూజలు చేస్తే వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నమ్ముతారు. అందుకే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీ సంఖ్యలో నేతలు ఈ ఆలయానికి చేరుకుని పూజలు చేస్తారు. త్రికోణ యంత్రంపై ఉన్న ఈ ఆలయం ఒక శక్తిపీఠంగా భక్తులు భావించి పూజిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)