Wall Clock Vastu: ఇంటి గోడ గడియారం మీ విజయాన్ని నిర్ణయిస్తుంది.. దీనికి సంబంధించిన వాస్తు నియమాలను తెలుసుకోండి

వాల్ క్లాక్ ను ఇంటి లోపల తప్పు దిశలో ఉంచినట్లయితే.. అది మీ జీవితంపై ప్రభావం చూపిస్తుందని.. కొన్ని రకాల ఇబ్బందులను  కలిగిస్తుందని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాస్తు నివారణలను గురించి తెలుసుకుందాం

Wall Clock Vastu: ఇంటి గోడ గడియారం మీ విజయాన్ని నిర్ణయిస్తుంది.. దీనికి సంబంధించిన వాస్తు నియమాలను తెలుసుకోండి
Wall Clock Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Nov 13, 2022 | 7:58 PM

సమయం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత విలువైనది. గడిచిన కాలం.. నోటి నుంచి జారిన మాట జీవితంలో ఎన్నటికీ తిరిగిరాదు. అందుకనే సమయాన్ని ఎప్పుడూ సద్వినియోగం చేసుకుంటూ మనిషి జీవించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతేకాదు ఇంట్లో సమయం తెలిపేందుకు పెట్టుకునే  గడియారం సరైన దిశలో ఉంటే.. అది మీ పురోగతికి కారణమని నమ్మకం. వాస్తు ప్రకారం గడియారం కాలానికి సంబంధించినది మాత్రమే కాదు.. అదృష్టానికి కూడా సంబంధించినది. అటువంటి పరిస్థితిలో ఇంట్లో గడియారాన్ని ఏర్పాటు చేసుకునే సమయంలో దానికి సంబంధించిన వాస్తు నియమాలను పూర్తిగా పాటించాలి. వాల్ క్లాక్ ను ఇంటి లోపల తప్పు దిశలో ఉంచినట్లయితే.. అది మీ జీవితంపై ప్రభావం చూపిస్తుందని.. కొన్ని రకాల ఇబ్బందులను  కలిగిస్తుందని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాస్తు నివారణలను గురించి తెలుసుకుందాం

  1. వాస్తు శాస్త్రం ప్రకారం  ఇంటికి తూర్పు దిశలో వాల్ క్లాక్ ను ఏర్పాటు చేసుకోవడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. గడియారాన్ని ఈ దిశలో ఉంచినట్లు అయితే ఆనందం, శ్రేయస్సు, అదృష్టానికి కారకంగా మారుతుందని నమ్ముతారు. అయితే పొరపాటున కూడా తలుపు మీద గడియారాన్ని పెట్టకూడదని గుర్తుంచుకోండి. వాస్తు ప్రకారం, అలా చేయడం ఒక లోపంగా పరిగణించబడుతుంది.. ఇది ప్రతికూలతకు కారణం అవుతుందట.
  2. పగిలిన వాల్ క్లాక్ ను పొరపాటున కూడా ఇంట్లో ఉంచకూడదు. ఇది దురదృష్టాన్ని కలిగిస్తుందని నమ్ముతారు. మీరు విరిగిన గడియారాన్ని లేదా  మూత ఉన్న గడియారాన్ని గోడకు వేలాడదీయవద్దు. ఇంట్లో వేలాడుతున్న మూసి గడియారం .. ఆ ఇంటి సభ్యుల ఆనందానికి తలుపులు వేస్తుందని నమ్మకం.
  3. చేతికి వాచీ పెట్టుకునే వారు ఎప్పుడూ తమ వాచ్ పదే పదే ఆగిపోకుండా చూసుకోవాలి. వాస్తు ప్రకారం.. ఇలా జరగడం వలన ప్రతికూలత పెరుగుతుందని,  సానుకూలత తగ్గుతుందని నమ్మకం. అటువంటి పరిస్థితిలో, మీరు కొత్త గడియారాన్ని కొనుగోలు చేయడానికి లేదా వాచ్ ను రిపేర్ చేయించడానికి ప్రయత్నించండి.
  4. వాస్తు ప్రకారం, ఇంట్లో వాల్ క్లాక్ ను తప్పు దిశలో ఉంచడం వల్ల మీకు ఆర్థిక నష్టం కలుగుతుంది. అంతేకాదు చేపట్టిన పనుల్లో కూడా ఆటంకం ఏర్పడుతుందని విశ్వాసం. అందుకని ఇంటి దక్షిణ దిశలో వాల్ క్లాక్ ను పొరపాటున కూడా పెట్టవద్దు. ఇలా చేయడం వల్ల ఇంటి యజమాని అనారోగ్యంతో ఇబ్బంది పడతారని నమ్మకం. అంతేకాదు గడియారాన్ని దక్షిణ దిశలో ఉంచడం ద్వారా ఆ ఇంటి యజమాని అభివృద్ధి పై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందిని నమ్మకం.
  5. ఇవి కూడా చదవండి
  6. వాస్తు ప్రకారం, లోలకం గడియారాలు మంగళకరమైనవిగా పరిగణించబడతాయి. ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిక్కున ఈ గడియారాన్ని ఏర్పాటు చేసుకోవడం వలన సంతోషం, ఐశ్వర్యం, అదృష్టాలు లభిస్తాయని నమ్ముతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)