Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: మీ స్నేహితుడు నమ్మకస్తుడో కాదు.. ఈ మూడు లక్షణాలను పరీక్షించమంటున్న చాణక్య

జీవితాన్ని ఎలా జీవించాలో ప్రజలకు నేర్పడానికి ఆచార్య చాలా ముఖ్యమైన విషయాలను చెప్పారు. ఈ పుస్తకాన్ని నేడు చాణక్య నీతి అని పిలుస్తారు. చాణక్య విధానంలోని అన్ని విషయాలు ఏ వ్యక్తినైనా అన్ని పరిస్థితులలో నడిపించగలవు.

Chanakya Niti:  మీ స్నేహితుడు నమ్మకస్తుడో కాదు..  ఈ మూడు లక్షణాలను పరీక్షించమంటున్న చాణక్య
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2022 | 3:04 PM

ఆచార్య చాణక్యుడు పండితుడు, ఆధ్యాత్మికం.. మొత్తం పాలనను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. చాణక్యుడి తెలివితేటలు అందరికీ ఒక ఉదాహరణగా నిలుస్తాయి. చాణక్యుడి జీవన విధానం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో.. తెలియజేయడానికి ఒక సాధారణ బాలుడైన చంద్రగుప్త మౌర్యుడుని రాజ్యానికి రాజు చేయడమే ఉదాహరణ అని అంటారు.  జీవితాన్ని ఎలా జీవించాలో ప్రజలకు నేర్పడానికి ఆచార్య చాలా ముఖ్యమైన విషయాలను చెప్పారు. ఈ పుస్తకాన్ని నేడు చాణక్య నీతి అని పిలుస్తారు. చాణక్య విధానంలోని అన్ని విషయాలు ఏ వ్యక్తినైనా అన్ని పరిస్థితులలో నడిపించగలవు.

చాణక్య మాటలను జీవితంలో అనుసరించడం వలన తప్పు ఒప్పుల  తప్పుల మధ్య తేడాను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తిని పరీక్షించడానికి ఎలాంటి పద్ధతులు అవలంబించాలో కూడా చాణక్యుడు చెప్పాడు. వాటి గురించి చెప్పుకుందాం…

త్యాగం అర్ధాన్ని తెలుసుకోవడం:  జీవితంలో త్యాగాలు చేయడం అంత సులభం కాదని చాణక్యుడు చెప్పాడు. మీరు ఎవరినైనా పరీక్షించాలనుకుంటే, అవతలి వ్యక్తి  త్యాగం  నిరతిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఒక వ్యక్తి తన ఆనందాన్ని ఇతరుల సంతోషం కోసం త్యాగం చేస్తే, అలాంటి వ్యక్తి ఎప్పుడూ మోసం చేయడు. కష్ట, దుఃఖ సమయాల్లో మీకు అండగా నిలబడని ​​వ్యక్తిని దూరం ఉంచండి. అలాంటి వ్యక్తులు మోసం చేయడమే కాదు..  హానికూడా కలిగించవచ్చు.

ఇవి కూడా చదవండి

విశ్వానికి పరీక్ష డబ్బు డబ్బు అనేది సాధారణంగా అందరి విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అయితే, ప్రపంచంలో డబ్బు కంటే ఇతర విషయాలు ముఖ్యమైనవి ఉన్నాయనే వ్యక్తులు ఉన్నారు. మీరు ఒకరి ఉద్దేశాన్ని పరీక్షించాలనుకుంటే.. అతనికి డబ్బు ఇవ్వండి. ఆ వ్యక్తి డబ్బును తిరిగి ఇస్తే.. మీరు అతనిని పూర్తిగా విశ్వసించవచ్చు. డబ్బు లావాదేవీ ఉత్తమ సంబంధాలను కూడా పాడు చేయగలవని చాణక్యుడు చెప్పాడు.

స్పష్టంగా ఉండటం

నిజయతీతో ఉండేవారు ఎదుటివారి దృష్టిలో చెడ్డవారు అనిపించినా వీరి మనసు చాలా మంచిది అని చాణక్య అంటారు.  ఎప్పుడూ నిజమే మాట్లాడిన వ్యక్తి.. ఎప్పుడూ భయం లేకుండా సత్యంతోనే ఉంటారు. అలాంటి నిజాయితీపరుడైన వ్యక్తితో సన్నిహితంగా ఉండాలని సూచిస్తున్నాడు. నిస్వార్థంగా, స్పష్టంగా ఉండే వ్యక్తి మీకు మేలు చేస్తారని చాణక్య చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)