Chanakya Niti: ఇటువంటి లక్షణాలున్న స్త్రీని భార్యగా పొందిన భర్త అదృష్ట వంతుడంటున్న చాణక్య
ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో స్త్రీల గురించి కూడా చాలా విషయాలు ప్రస్తావించాడు. ఏ పురుషుడి జీవితమైనా విజయవంతం కావాలంటే.. జీవిత భాగస్వామిలో కొన్ని లక్షణాలు ఉండాలని.. పేర్కొన్నాడు. ఆ స్త్రీలు ఎవరో తెలుసుకుందాం.
ఆచార్య చాణక్యుడు గొప్ప ఆర్థికవేత్త , రాజకీయవేత్త, గొప్ప పండితుడు మాత్రమే కాదు మంచి గురువు కూడా. చాణక్యుడు మానవ జీవితం గురించి చెప్పిన విషయాలపై ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. ప్రజలు ఇప్పటికీ తమ జీవితానికి చాణక్యుడి బోధనలను అన్వయించుకోవడానికి ఇదే కారణం. తన తెలివితేటల బలంతో ఒక సాధారణ బాల చంద్రగుప్తుడిని మగద సామ్రాజ్యానికి చక్రవర్తిగా చేసాడు. ఉద్యోగం, వ్యాపారం, సంబంధాలు మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలు నీతి శాస్త్రంలో వివరించబడ్డాయి. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో స్త్రీల గురించి కూడా చాలా విషయాలు ప్రస్తావించాడు. ఏ పురుషుడి జీవితమైనా విజయవంతం కావాలంటే.. జీవిత భాగస్వామిలో కొన్ని లక్షణాలు ఉండాలని.. పేర్కొన్నాడు. ఆ స్త్రీలు ఎవరో తెలుసుకుందాం.
- విద్యావంతులైన స్త్రీలు – ఆచార్య చాణక్యుడు ప్రకారం, విద్యావంతురాలు, సంస్కారవంతులు, సత్ప్రవర్తన కలిగిన స్త్రీ ఏ వ్యక్తి జీవితాన్ని అయినా విజయవంతం చేయగలదు. అలాంటి మహిళలు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. అలాంటి మహిళలు ఎటువంటి పరిస్థితి ఏర్పడినా ఎటువంటి నిర్ణయం తీసుకోవడంలోనైనా వెనుకడుగు వేయరు.
- మృదు సంభాషణ – ఆచార్య చాణక్యుడు ప్రకారం మృదువుగా మాట్లాడే స్త్రీ.. జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో ఎప్పుడూ ఆనంద వాతావరణం ఉంటుంది. అంతేకాదు అటువంటి స్త్రీ వల్ల కుటుంబ సభ్యుల కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాంటి మహిళలు ఎల్లప్పుడూ గౌరవించబడతారు.
- కోరికలను అదుపులో ఉంచుకునే స్త్రీ – పరిస్థితులకు అనుగుణంగా తన కోరికలను ఎలా అదుపులో ఉంచుకోవాలో తెలిసిన స్త్రీని భార్యగా పొందిన పురుషుడు చాలా అదృష్టవంతుడుగా పరిగణింపబడతాడు. అలాంటి మహిళలు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కష్ట నష్టాల్లో కూడా భర్తతో కలిసి ఉంటారు. దీని కారణంగా.. భర్త ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. అలాంటి మహిళలు కుటుంబం సరైన మార్గంలో నడవడానికి స్ఫూర్తినిస్తారు.
- ప్రశాంత స్వభావం – చాణక్య నీతి ప్రకారం, ప్రశాంత స్వభావం కలిగిన స్త్రీ ఒక వ్యక్తి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతుంది. అలాంటి స్త్రీలకు క్లిష్ట పరిస్థితి నుండి ఎలా బయటపడాలో తెలుసు. అలాంటి స్త్రీలు ఇంట్లో ఆనందాన్ని, శాంతిఉండేలా చూస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)