బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం.. జూనియర్లను చితకబాదిన సీనియర్లు.. రంగంలోకి పోలీసులు..
గత కొన్నాళ్ల నుంచి బాసర ట్రిపుల్ ఐటీ తరచుగా వార్తల్లోకెక్కుతోంది. ఆ మధ్య వసతులు సరిగ్గా లేవంటూ కొన్నిరోజులు పాటు విద్యార్థులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే.
నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ మరోమారు వార్తల్లో నిలిచింది. బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ భూతం బుసలు కొట్టింది. బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో మరోమారు ఆందోళన మొదలైంది. జూనియర్లను సీనియర్లు వేధిస్తున్నారంటూ అసిస్టెంట్ డీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా క్యాంపస్‌లో ర్యాగింగ్ సాగుతున్నట్లుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఐదుగురు సీనియర్ విద్యార్ధులపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
గురువారం పియుసి మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులపై పియుసి – 2 విద్యార్థులు ర్యాగింగ్ కు పాలపడ్డారు. చిలికి చిలికి గాలివానగా మారిన రాగింగ్ కాస్త ఇరువర్గాలు మధ్య వాగ్వివాదంగా తలెత్తి అనంతరం గొడవకు దారి తీసింది. పీయూసి– 2 విద్యార్థులు జూనియర్ల పై దాడికి పాల్పడటంతో విషయం అధికారుల దృష్టికి చేరింది. ఉన్నతాధికారులు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో పోలీస్లను ఆశ్రయించారు బాధిత విద్యార్థులు. స్పందించిన ఎస్సై మహేష్ కళాశాల వార్డెన్ ఫిర్యాదు మేరకు తెలంగాణ ప్రోహిబిషన్ ఆక్ట్ సెక్షన్ 323, 506, రాగింగ్ సెక్షన్ 4(1/2/3) ప్రకారం ఐదుగురు విద్యార్థులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
బాసర ట్రిపుల్ ఐటీలోని స్థానిక కృష్ణా బాయిస్ హస్టల్ రూమ్ నెం–228 లో పియుసి –1 చదువుతున్న విద్యార్థులకు సంబందించిన (కళాశాల యాజమాన్యం సమకూర్చిన నూతన వస్తువులైన బెడ్ కార్డ్లు , టూబ్ లైట్లు) వస్తువులను . పియుసి–2 విద్యార్థులు జూనియర్లను బెదిరించి తీసుకెళ్ళినట్లు సమాచారం. ఐతే గత కొద్ది రోజుల క్రితం కళాశాల డైరెక్టర్ సతీష్ కుమార్ రాత్రి వేళలో హాస్టల్ భవనాల్లో తనిఖీ చేయగా జూనియర్లు తమ బెడ్ కార్డులు, టూబ్ లైట్లు తీసుకెళ్లినట్లు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా కక్ష సాధింపు చర్యగా సీనియర్లు రాగింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది.
గత కొన్నాళ్ల నుంచి బాసర ట్రిపుల్ ఐటీ తరచుగా వార్తల్లోకెక్కుతోంది. ఆ మధ్య వసతులు సరిగ్గా లేవంటూ కొన్నిరోజులు పాటు విద్యార్థులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. మంత్రుల హామీ నిరసన విరమించుకున్నారు. అయితే మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ పెద్దల హామీతో పిల్లలు నిరసన విరమించుకున్నారు. తాజాగా ర్యాగింగ్ విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి