Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkey Video: అసలే కోతి.. ఓ వైపు మద్యం .. మరో వైపు మంచింగ్ కోసం చిప్స్.. నెట్టింట్లో ఫన్నీ వీడియో వైరల్

రోడ్డు పక్కనే ఉన్న మైదానంలో ఇద్దరు యువకులు మద్యం సేవిస్తున్నారు. ఈ సమయంలో కోతి అక్కడకు చేరుకుని వారిని బెదిరించింది. అక్కడ ఉన్న ఆహార పదార్థాలను చూసి యువకులను కరవడానికి ప్రయత్నించడంతో ఇద్దరు యువకులు అక్కడ నుంచి పరుగులు తీశారు

Monkey Video: అసలే కోతి.. ఓ వైపు మద్యం .. మరో వైపు మంచింగ్ కోసం చిప్స్.. నెట్టింట్లో ఫన్నీ వీడియో వైరల్
Monkey Drinking Alcohol
Follow us
Surya Kala

|

Updated on: Nov 18, 2022 | 8:40 PM

ఇంటర్నెట్‌లో తరచుగా రకరకాల వీడియోలు  వైరల్ అవుతూ సందడి చేస్తుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ కోతి మద్యం తాగి మత్తులో ఉన్న వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే మద్యం తాగిన తర్వాత కోతి కూడా ఆ రుచిని ఆస్వాదిస్తూ కనిపించింది. ఈ వీడియో మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందినది. ఇప్పుడు ఈ వైరల్ వీడియో క్లిప్ చూసిన వారు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పొలంలో కూర్చొని కొందరు యువకులు మద్యం సేవిస్తున్నారని.. అప్పుడు అక్కడకు వచ్చిన కోతి ఆ యువకులను తరిమి కొట్టిందని.. అనంతరం ఆ యువకులు తాగుతూ వదిలేసిన గ్లాస్ లోని మద్యాన్ని రుచి చూసి ఆనందించడం ప్రారంభించిందని చూసిన వారు చెబుతున్నారు.

సమాచారం ప్రకారం.. ఈ వీడియో శివపురి జిల్లాలోని కరోరా తహసీల్ ప్రాంతానికి చెందినది. రోడ్డు పక్కనే ఉన్న మైదానంలో ఇద్దరు యువకులు మద్యం సేవిస్తున్నారు. ఈ సమయంలో కోతి అక్కడకు చేరుకుని వారిని బెదిరించింది. అక్కడ ఉన్న ఆహార పదార్థాలను చూసి యువకులను కరవడానికి ప్రయత్నించడంతో ఇద్దరు యువకులు అక్కడ నుంచి పరుగులు తీశారు. కోతి తన దగ్గరికి రావడం చూసి యువకులు అక్కడి నుంచి పారిపోయారు. అయితే మరుసటి క్షణం ఏం జరిగిందో దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్లిప్‌లో కోతి ఆల్కహాల్ ఉన్నగ్లాస్ ని తీసుకుని చకచకా తాగింది. అనంతరం సమీపంలో పడి ఉన్న చిప్స్  ప్యాకెట్‌ను చింపి తిని ఎంజాయ్ చేసింది. ఈ సమయంలో అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అక్కడ నుంచి యువకులు కోతిని తరిమి కొట్టారు.

తాము కోతుల బెడదతో ఇబ్బంది పడుతున్నామని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. కొన్నిసార్లు ఈ కోతులు మోటార్‌సైకిల్‌ పై ప్రయాణిస్తున్న వారిపై దాడి చేస్తున్నాయని.. మరి కొన్నిసార్లు కాలినడకన వెళ్తున్న వారిపై దాడి చేస్తాయని చెబుతున్నారు. వీడియోలో కనిపించిన కోతి మానసిక సమతుల్యతను కోల్పోయిందని గ్రామస్తులు చెప్పారు. ప్రతిరోజూ కోతి రకరకాల హాస్యాస్పదమైన పనులు చేస్తూనే సందడి చేస్తుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..