Toilet Selfie: స్టూడెంట్స్ టాయిలెట్‌తో సెల్ఫీ.. అధికారులు ఆదేశాలు.. మండిపడుతున్న టీచర్స్

ఎటువంటి వారినైనా సరే టాయిలెట్‌లో సెల్ఫీ తీసుకోమని అడిగితే ఎలా ఉంటుంది. వెంటనే ఛీ అంటూ ఫేస్ ను పెడతాం.. కానీ ఇలా నిజంగా టాయిలెట్ లో సెల్ఫీ తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.

Toilet Selfie: స్టూడెంట్స్ టాయిలెట్‌తో సెల్ఫీ.. అధికారులు ఆదేశాలు.. మండిపడుతున్న టీచర్స్
Selfie With Toilet In Mahar
Follow us
Surya Kala

|

Updated on: Nov 18, 2022 | 6:06 PM

ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వయసు తో నిమిత్తం లేకుండా సెల్ఫీ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సోషల్ మీడియాలో తమ సెల్ఫీలను పోస్ట్ చేయడం కోసం ఎంతటి సాహసానికి కూడా వెరవడం లేదు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నదులు, పర్వతాలు, కొండలు, కోనలతో పాటు.. రకరకాల ప్రాంతాల్లో సెల్ఫీలను తీసుకుంటున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఎటువంటి వారినైనా సరే టాయిలెట్‌లో సెల్ఫీ తీసుకోమని అడిగితే ఎలా ఉంటుంది. వెంటనే ఛీ అంటూ ఫేస్ ను పెడతాం.. కానీ ఇలా నిజంగా టాయిలెట్ లో సెల్ఫీ తీసుకున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా తెరపైకి వచ్చింది. అక్కడ అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ‘సెల్ఫీ విత్ టాయిలెట్’ పోటీలో పాల్గొని వారి ‘డ్రీమ్ టాయిలెట్’ స్కెచ్‌ను రూపొందించాలని విద్యాశాఖ అధికారి ఆదేశించారు.

అదే సమయంలో, టాయిలెట్ పోటీతో సెల్ఫీని నిర్వహించడంపై పాఠశాలలు, టీచర్స్ , విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి నవంబర్ 19న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ‘ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం’ నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి నవంబర్ 14న ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం పాఠశాలల్లో పలు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ‘క్లీన్‌ టాయిలెట్‌ క్యాంపెయిన్‌’ ప్రారంభించినట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులోభాగంగా 4వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ‘పరిశుభ్రత, భూగర్భ జలాలు’ అనే అంశంపై పోటీలు, కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ‘సెల్ఫీ విత్ టాయిలెట్’ కాకుండా, ‘నా డ్రీమ్ టాయిలెట్’, ‘మై స్కూల్, మై సేఫ్ టాయిలెట్’ వంటి అంశాలపై డ్రాయింగ్ పోటీని నిర్వహించడం వంటి ఇతర కార్యకలాపాలను కూడా ఏర్పటు చేయమని సూచించారు.

ఇవి కూడా చదవండి

దీంతోపాటు ‘నా పాఠశాల, నా మరుగుదొడ్డి’, ‘మరుగుదొడ్డిని పరిశుభ్రంగా వినియోగించుకునే విధానం’ వంటి అంశాలపై వీధి నాటకాల పోటీలను కూడా నిర్వహించాలని టీచర్స్ కు సూచించారు. విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు కూడా పాల్గొనాలన్నారు. అన్ని కార్యక్రమాలు ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడతాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో ఈ పోటీలను నిర్వహించాల్సి ఉంటుందని.. వీటి ఫలితాలు నవంబర్ 19న ప్రకటించబడతాయని వెల్లడించారు ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారి.

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు: ఈ మేరకు నాసిక్ జిల్లా పరిషత్ (జెడ్పీ) విద్యాశాఖ అధికారి బీడీ కనోజ్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇదే విషయంపై ఒక ఉపాధ్యాయుడు స్పందిస్తూ.. మాకు ఏ విషయం చెప్పకుండా మమ్మల్ని ఏమీ సంప్రదించకుండా ఈ ఉత్తర్వు జారీ చేశారని చెప్పారు. అసలు టాయిలెట్లతో సెల్ఫీలు దిగాలని పిల్లలను ఎందుకు బలవంతం చేస్తున్నారంటూ విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులతో  సెల్ఫీలు దిగాలని చెప్పకుండా పరిశుభ్రమైన మరుగుదొడ్లను ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.

యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఇటీవల విడుదల చేసిన డేటా గురించి ఒక ఉపాధ్యాయుడు ప్రస్తావిస్తూ.. అందులో డేటా ప్రకారం.. మహారాష్ట్రలోని 65,639 ప్రభుత్వ పాఠశాలల్లో 64,581 మరుగుదొడ్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ టాయిలెట్స్ లో 62,038 మాత్రమే పని చేసే విధంగా ఉంటాయని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…