AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాతాపితా గురు దైవం.. మాటల్లోనే కాదు చేతల్లో చూపుతోన్న బస్సు యజమాని.. నువ్వు మనసున్న మారాజు..

బస్సులోకి ప్రయాణీకులను స్వాగతించే బోర్డు, 'మాతా పితా గురు దైవం - వృద్ధులను గౌరవించండి' అని ఉండడమే కాదు.. 75 ఏళ్లు పైబడిన వారికి సేవ ఉచితం అనే బోర్డు కూడా బస్సుల్లో ఉంటుంది.

మాతాపితా గురు దైవం.. మాటల్లోనే కాదు చేతల్లో చూపుతోన్న బస్సు యజమాని.. నువ్వు మనసున్న మారాజు..
Mary Matha Bus Service
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2022 | 5:59 PM

మాతాపితా గురు దైవం.. వృద్ధులను, స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. ఇవి మనం చిన్నతనం నుంచి చుదువుకుంటూనే ఉన్నాం.. అయితే వీటిని ఆచరణలో పెట్టేవారు మాత్రం అతి కొద్దీ మంది అని చెప్పవచ్చు. బస్సుల్లో ఇది వృద్ధులకు, స్త్రీలకు మాత్రమే సీట్లు కేటాయించడబడినవి అని ఉన్నా సరే.. వాటిని పట్టించుకోకుండా ఆ సీట్లలో కూర్చుని కొంతమంది యువత వృద్ధులతో, స్త్రీలతో వాదిస్తూ ఉంటారు.. అయితే ఓ ప్రయివేట్ బస్సు సర్వీసు మాత్రం వృద్దులంటే తమకున్న గౌరవాన్ని చాటుకుంది. ఏకంగా వృద్ధులకు తమ బస్సులలో ప్రయాణం ఉచితం అని ప్రకటించింది. ఈ ఘటన కేరళలో పాలక్కాడ్ జిల్లాలోని చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

శ్రీకృష్ణాపురం కరీంపుజాకు చెందిన సీబీ జోసెఫ్…  మన్నార్కడ్ – గురువాయూరు, ఎలంబులస్సేరి- షోర్నూర్, ఎలంబులస్సేరి – ఒట్టపాలెం, పోంబ్రా – ఒట్టపాలెం రూట్లలో నాలుగు బస్సు సర్వీసుల్లో ప్రయాణించే వృద్ధులకు ఉచిత ప్రయాణం ఇవ్వాలని యజమాని ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు వృద్ధులకు తన బస్సులన్నింటిలో ఉచిత ప్రయాణం అందించనున్నానని పేర్కొన్నాడు. బస్సులోకి ప్రయాణీకులను స్వాగతించే బోర్డు, ‘మాతా పితా గురు దైవం – వృద్ధులను గౌరవించండి’ అని ఉండడమే కాదు..  75 ఏళ్లు పైబడిన వారికి సేవ ఉచితం అనే బోర్డు కూడా బస్సుల్లో ఉంటుంది.

తమ జిల్లాలో మారుమూల ప్రాంతాల నుంచి వైద్యం, మందులు, ఇతర అవసరాల కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సిన వృద్ధులను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు బస్సు యజమాని సీబీ జోసెఫ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

బిల్డింగ్ కాంట్రాక్టర్ గా ఉన్న సీబీకి బస్సులపై మక్కువ ఉండడంతో నాలుగేళ్ల క్రితం బస్సు సర్వీసును ప్రారంభించాడు. తనకు బస్సు రవాణా ద్వారా లాభాలను ఆర్జించడం కంటే.. ఈ బస్సు సర్వీసుని ప్రజలకు సేవగా భావిస్తున్నట్లు జోసెఫ్ చెప్పారు. ‘మఠా పితా గురు దైవం’ అనే బోర్డు ద్వారా, యువతరం వృద్ధులను గౌరవించేలా ప్రోత్సహించాలని.. యువతకు  వృద్ధులను పట్ల ప్రేమ .. వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోబెట్టాలని ఉద్దేశం తనదని పేర్కొన్నారు జోసెఫ్.

బస్సుల సిబ్బంది కూడా యాజమాన్య ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తున్నారు. వారు ప్రయాణికులను విశ్వసిస్తారు,  వృద్ధులను ఉచితంగా తమ బస్సుల్లో ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు చేస్తారు. కోవిడ్ తర్వాత ఆదాయం తగ్గినప్పటికీ  మేరీ మాత బస్సులు ఈ మార్గాలలో ప్రయాణించే వృద్ధులకు ఉచిత సర్వీసులను అందిస్తూనే ఉంది.. యజమాని మంచితనంతో బస్సు లు రయ్యి రయ్యి అంటూ హారన్ మోగిస్తూ తిరుగుతూనే ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..