Shraddha Murder Case: వీడు మనిషి రూపంలో రాక్షసుడే.. డెడ్ బాడీ గట్టిపకుండా అఫ్తాబ్ ఏం చేశాడో తెలిస్తే షాక్..

శరీరాన్ని మృదువుగా ఉండేలా చేసేందుకు.. ముందుగా వేడినీళ్లను శరీరంపై పోసినట్లు.. అయితే అప్పుడు గీజర్ సరిగా పనిచేయడం లేదని.. అందుకే 19వ తేదీన ఫ్రీజ్ కొనేందుకు వెళ్లానని.. తాను ఫ్రిడ్జ్ కొన్నానని అఫ్తాబ్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.

Shraddha Murder Case: వీడు మనిషి రూపంలో రాక్షసుడే.. డెడ్ బాడీ గట్టిపకుండా అఫ్తాబ్ ఏం చేశాడో తెలిస్తే షాక్..
Shraddha Murder Case
Follow us
Surya Kala

|

Updated on: Nov 17, 2022 | 6:59 PM

ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రద్ధాను ప్రియుడు  అఫ్తాబ్ అమీన్ పూనావల్ల దారుణంగా హత్య చేశాడు. శ్రద్ధను 35 ముక్కలుగా నరికి.. ఆ ముక్కలన్నీ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విసిరేసినట్లు పోలీసుల ఎదుట స్వయంగా అంగీకరించాడు.  ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు 13 మృతదేహ ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ముక్కలను DNA పరీక్షకు పంపనున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. శ్రద్ధా మృతదేహాన్ని అతి కిరాతకంగా నరికి పెద్ద ఫ్రిజ్‌లో భద్రపరచడమే కాదు.. ప్రేయసిని చంపిన తర్వాత ఎటువంటి భయం లేకుండా.. ఇంటి నుంచి బయటకు వెళ్లి బీరు కొన్నాడు. అంతేకాదు.. అదే రూమ్ లో కూర్చుని చాలా సేపు సిగరెట్ తాగాడు. అనంతరం ఆకలి వేసి జొమాటోకి ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాడు. అఫ్తాబ్‌ కిరాతకం వెలుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అఫ్తాబ్‌కి ఉరిశిక్ష వేయాలనే డిమాండ్ దేశం మొత్తం మీద పెరుగుతోంది. అఫ్తాబ్‌కి ఉరిశిక్ష విధించాలని హిందూ సంస్థలతో పాటు రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఇంట్లో దొరికిన ఫ్రీజ్, వాటర్ హీటింగ్ రాడ్, వాక్యూమ్ క్లీనర్  అఫ్తాబ్ ఇంటి నుంచి కొత్త ఫ్రీజ్, వాటర్ హీటింగ్ రాడ్, వాక్యూమ్ క్లీనర్, బ్లీచ్ పౌడర్‌ను కూడా పోలీసులు కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. శరీరాన్ని ముక్కలు చేస్తున్న సమయంలో రక్తం డ్రైన్ ద్వారా బయటకు వెళ్తుందని భావించి.. ఆ రక్తం నీటిని అలాగే ఇంట్లో ఉంచానని అఫ్తాబ్ విచారణలో పోలీసులకు చెప్పాడు. రక్తం నేరుగా కాలువలోకి వెళ్లకుండా అనేక రకాల ప్లాన్స్ వేసినట్లు పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

మృతదేహం బిగుసుకుపోకుండా బ్లీచ్ వాటర్: అఫ్తాబ్ బాత్‌రూమ్‌లో బకెట్‌లో నీరుని వాటర్ హీటర్ ద్వారా వేడి చేశాడు.  శ్రద్ధా శరీరం వివిధ భాగాలకు బ్లీచ్ వేసి, శరీరం బిగిసిపోకుండా ఉండకుండా చేశాడు. అనంతరం మే 19 న శరీరాన్ని ముక్కలు కోయడం కొనసాగించాడు. బాడీ పార్ట్స్ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బంది రాకూడదని ఇలా చేశారట.

శరీరం మృదువుగా ఉండేందుకు వేడినీళ్లలో.. ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. శరీరాన్ని మృదువుగా ఉండేలా చేసేందుకు..  ముందుగా వేడినీళ్లను  శరీరంపై  పోసినట్లు.. అయితే అప్పుడు గీజర్ సరిగా పనిచేయడం లేదని..  అందుకే 19వ తేదీన ఫ్రీజ్ కొనేందుకు వెళ్లానని.. తాను ఫ్రిడ్జ్ కొన్నానని అఫ్తాబ్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. అంతేకాదు వేడి నీటి కోసం ఛతర్‌పూర్ ప్రాంతం నుండి వాటర్ హీటింగ్ రాడ్ ను కొనుగోలు చేసినట్లు పోలీసులకు తెలిపాడు అఫ్తాబ్.

పోలీసులు మొదట అఫ్తాబ్‌ను రేపు గురుగ్రామ్ కి తీసుకుని వెళ్లనున్నారు. అక్కడ నుంచి అతడిని పోలీసులు పాత ఆఫీస్ బాస్, స్నేహితుడు, ఆఫీసు బాయ్స్ సహా ఇతర వ్యక్తులను విచారించనున్నారు. పోలీసులు అతని స్నేహితులను కూడా పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.

అఫ్తాబ్‌కు నార్కో పరీక్షకు కోర్టు అనుమతి:

శ్రద్ధా హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ను నార్కో టెస్టు ద్వారా విచారణ చేయడానికి పోలీసులు కోరగా..  అతడు నార్కో పరీక్షకు అంగీకరించాడు. నార్కో దాని ప్రభావం గురించి మీకు తెలుసా అని నిందితుడిని కోర్టు ప్రశ్నించింది. ఆ తర్వాత నిందితుడు తన సమ్మతిని తెలిపాడు. నిందితుడు అఫ్తాబ్‌ను విచారణ నిమిత్తం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లకు తీసుకెళ్లాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడు అఫ్తాబ్‌కు నార్కో అనాలిసిస్ పరీక్షకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసుల దరఖాస్తును కూడా కోర్టు స్వీకరించింది.

అఫ్తాబ్‌కు ఐదు రోజుల పోలీసు కస్టడీ పొడిగింపు

శ్రద్ధా హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాకేత్ కోర్టుకు హాజరయ్యారు. సాకేత్ కోర్టు అఫ్తాబ్‌కు 5 రోజుల పోలీసు రిమాండ్ పొడిగించింది. అఫ్తాబ్‌కు 10 రోజుల రిమాండ్‌ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.

అఫ్తాబ్ కు శ్రద్ధ మృతదేహాన్ని కట్ చేయడానికి 10 గంటల సమయం

పోలీసుల విచారణలో సంఘటన జరిగిన మరుసటి రోజు.. అతను శ్రద్ధ మృతదేహాన్ని బాత్రూమ్‌కు తీసుకుని వెళ్లినట్లు  అఫ్తాబ్ చెప్పాడు. పది గంటల పాటు డెడ్ బాడీని కంటిన్యూగా కోస్తూనే ఉన్నాడు.ఈ క్రమంలో బాత్ రూమ్ లో షవర్ ఓపెన్ చేసి మృతదేహంలోని రక్తాన్ని శుభ్రం చేశాడు. శరీరం గట్టిపడకుండా ఉండేందుకు ఆ ముక్కలపై వేడినీళ్లు, బ్లీచ్ కూడా  చల్లినట్లు నిందితుడు వెల్లడించాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..