NIA: ఉగ్రవాదానికంటే అది మరింత ప్రమాదకరం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

ఉగ్రవాదానికంటే దానికి నిధులు అందించడం మరింత ప్రమాదకరమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. టెర్రరిజాన్ని ఏ మతంతో ముడిపెట్టకూడదన్నారు. ఎన్‌ఐఏ ఆధ్వర్యంలో నవంబర్ 18వ తేదీ శుక్రవారం..

NIA: ఉగ్రవాదానికంటే అది మరింత ప్రమాదకరం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
Amit Shah, Union Home Minister
Follow us
Amarnadh Daneti

|

Updated on: Nov 18, 2022 | 6:05 PM

ఉగ్రవాదానికంటే దానికి నిధులు అందించడం మరింత ప్రమాదకరమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. టెర్రరిజాన్ని ఏ మతంతో ముడిపెట్టకూడదన్నారు. ఎన్‌ఐఏ ఆధ్వర్యంలో నవంబర్ 18వ తేదీ శుక్రవారం నిర్వహించిన నో మనీ ఫర్ టెర్రర్ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడారు. హింసకు పాల్పడేందుకు, యువతను సమూలంగా మార్చేందుకు, ఆర్థిక వనరులను పెంపొందించేందుకు ఉగ్రవాదులు నిరంతరం కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారని అన్నారు. రాడికల్ కంటెంట్‌ను వ్యాప్తి చేయడానికి, వారి గుర్తింపులను దాచడానికి డార్క్‌నెట్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఉగ్రవాదం ప్రపంచ శాంతి, భద్రతకు అత్యంత తీవ్రమైన ముప్పు అని అన్నారు. తీవ్రవాదం కంటే దానికి ఆర్థిక సహాయం చేయడం చాలా ప్రమాదకరమని తెలిపారు. ఇలా చేయడం వల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు బలహీనం అవుతాయని అమిత్ షా పేర్కొన్నారు. తీవ్రవాదులు డార్క్‌నెట్‌ను ఉపయోగించి రాడికల్ కంటెంట్‌ను వ్యాప్తి చేయడానికి, వారి గుర్తింపులను దాచడానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. క్రిప్టోకరెన్సీల వంటి వర్చువల్ ఆస్తుల వినియోగం మరింత పెరుగుతోందన్నారు. డార్క్ నెట్‌లో జరుగుతున్న ఇలాంటి కార్యకలాపాల తీరును విశ్లేషించి, అర్థం చేసుకోవాలని సూచించారు. అలాంటి వాటికి పరిష్కారాలను కనుగొనాలని తెలిపారు.

దురదృష్టవశాత్తు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి చేస్తున్న సామూహిక సంకల్పాన్ని అణగదొక్కడానికి, నాశనం చేయడానికి కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని అమిత్ షా అన్నారు. ఉగ్రవాదులకు కొన్ని దేశాలు రక్షణ కల్పిస్తూ.. ఆశ్రయాన్ని అందిస్తున్నాయన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించడం అంటే దానిని ప్రోత్సహించినట్లే అని పేర్కొన్నారు. అలాంటి దేశాలు చేస్తున్న ప్లాన్ లను విజయవంతం కాకుండా చూడటం సమిష్టి బాధ్యత అన్నారు.

ఇవి కూడా చదవండి

2021 ఆగస్టు తర్వాత దక్షిణాసియా ప్రాంతంలో పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పాలనలో మార్పు, ఐఎస్ఐఎస్, అల్ ఖైదాల ప్రభావం పెరగడం ప్రాంతీయ భద్రతకు పెద్ద సవాలుగా మారాయని అమిత్ షా తెలిపారు. కొత్త సమీకరణాలు టెర్రర్ ఫండింగ్ సమస్యను మరింత తీవ్రంగా మార్చాయని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..